Take a fresh look at your lifestyle.

26 ‌వరకు అసెంబ్లీ సమావేశాలు

  • 18న వార్షిక బడ్జెట్‌, 26‌న ద్రవ్య వినిమయ బిల్లు
  • 19,21 సెలవు దినాలు
  • బిఎసిలో నిర్ణయం

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు ఈనెల 26 వరకూ జరుగనున్నాయి. ఈనెల 18న శాసనసభలో 2021-22 సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈమేరకు సోమవారం జరిగిన అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర బడ్జెట్‌ ‌సమావేశాలలో గవర్నర్‌ ‌డా.తమిళిసై ప్రసంగం అనంతరం స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బిఏసి సమావేశం జరిగింది. మంగళవారం దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మృతికి ఉభయ సభలు సంతాపం తెలుపనున్నాయి. 17న గవర్నర్‌ ‌ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చతో పాటు దానిపై ప్రభుత్వ సమాధానం ఉంటుంది. 19,21న సెలవు దినాలుగా ప్రకటించారు. 20,22 తేదీలలో బడ్జెట్‌పై ఉభయ సభల్లోనూ చర్చ జరుగుతుంది.

26న ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బ్జడెట్‌ అం‌చనాలకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. బడ్జెట్‌ ‌కు సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ‌సవి•క్ష నిర్వహించిన విషయం తెలిసిందే. తర్వాత హరీశ్‌ ఇప్పటికే ఒకసారి అధికారులతో సమావేశమై బ్జడెట్‌ ‌కేటాయింపులపై చర్చించారు. దీనికి కొనసాగింపుగా ఆదివారం మరోసారి చర్చించారు. ఒకటి రెండు రోజుల్లోనే బడ్జెట్‌ ‌ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత బడ్జెట్‌ అం‌చనాలు ఖరారవుతాయి. కాగా, ఈసారి వాస్తవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టవచ్చు. ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం నుంచి ఆయా రంగాలు కోలుకుంటున్నాయి.

కొన్ని రంగాలు ఇంకా కోలు కోలేదు. అవి పూర్వ స్థితికి రావడానికి మరింత సమయం సట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది రాబడి కూడా పరిమితంగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను ప్రకటించాల్సి ఉంది. నిరుద్యోగ భృతి అమలు, సంక్షేమ పథకాల కొనసాగింపు వంటి అంశాలు సరేసరి. ఈ అవసరాలకు భారీగా నిధులు అవసరముంటుందని అంచనా వేస్తున్నారు. భూముల అమ్మకం ద్వారా నిధులను సవి•కరించాలన్న ఆలోచనను ఈ ఏడాది అమలు చేయలేకపోయారు. వచ్చే ఏడాదైనా దానిని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొందిస్తున్నట్టు సమాచారం.

Leave a Reply