Take a fresh look at your lifestyle.

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

  • కోవిడ్‌ ‌నిబంధనలు పాటిస్తూ నిర్వహణ..
  • అసెంబ్లీ ఆవరణలో వ్యాక్సినేషన్‌, ‌కోవిడ్‌ ‌పరీక్షా కేంద్రాలు
  • సభ ముందుకు దళితబంధు సహా ఎనిమిది బిల్లులు
  • తొలిసారిగా మండలికి వాణీదేవి, శాసనసభకు నోముల భగత్‌
  • ‌వరుసగా రెండోసారి మండలికి పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి
  • గుత్తా, కడియం, బోడకుంటి తదితరులు కూడా మండలికి దూరం
  • రాజీనామాతో తొలిసారి అసెంబ్లీకి దూరంగా మాజీమంత్రి ఈటెల
  • మండలి ఛైర్మన్‌ ‌హోదాలో సమావేశాలకు ప్రోటెం స్పీకర్‌ ‌భూపాల్‌ ‌రెడ్డి
  • అసెంబ్లీలో సమాచారంపై సన్నద్ధంగా ఉండాలి : అధికారులకు సిఎస్‌ ఆదేశాలు
  • అసెంబ్లీ పరిసరాల్లో నిషేధాజ్ఞలు : సిపి అంజనీ కుమార్‌
  • అక్టోబర్‌ 1 ‌వరకు కొనసాగే అవకాశం

తెలంగాణ శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు శుక్రవారం నుంచి నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభ, మండలి.. అక్టోబర్‌ 1 ‌వరకు కొనసాగే అవకాశముంది. సభ జరిగే తేదీలు, ఎజెండా తదితరాలపై అసెంబ్లీ సమావేశాల తొలి రోజున జరిగే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశమైన తర్వాత ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు, మండలి సభ్యుల మృతికి సంతాపం ప్రకటించి వాయిదా పడే అవకాశాలున్నాయి. శని, ఆది వారాల్లో విరామం తర్వాత తిరిగి ఈ నెల 27 నుంచి వరుసగా ఐదు రోజుల పాటు సభలు సాగే అవకాశముంది. ప్రొటెమ్‌ ‌చైర్మన్‌ ‌హోదాలో వెన్నవరం భూపాల్‌రెడ్డి తొలిసారి మండలి సమావేశాలను నిర్వహించనున్నారు.

పదవీవిరమణ చేసిన గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి తదితరులు సమావేశాకు దూరం కానున్నారు.  సమావేశాల కోసం పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని ప్రకటించారు. నగర పోలీస్‌ ‌కమిషన్‌ అం‌జనీకుమార్‌ ఇప్పటికే పోలీస్‌ అధికారులతో సవి•క్షించి బందోబస్తు ఏర్పాట్లు పర్యవేశించారు. ఇకపోతే ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికలో పట్టభద్రుల కోటాలో ఎన్నికైన సురభి వాణీదేవి తొలిసారిగా, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వరుసగా రెండోసారి మండలిలో అడుగుపెడుతున్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ‌నుంచి ఎన్నికైన నోముల భగత్‌ ‌కూడా తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు.

రాజీనామా చేయడంతో ఈటెల రాజేందర్‌ ‌తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం కోల్పోయారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ’దళితబంధు’కు చట్టబద్‌ధ్దత కల్పించే బిల్లుతో పాటు మరో ఏడు బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. కొన్ని ఆర్డినెన్స్‌లకు చట్టబద్దత కల్పించే బిల్లులు కూడా ఇందులో ఉన్నట్లు తెలిసింది. వరి ధాన్యం కొనుగోలు, నదీ జలాల వివాదం, దళితబంధు పథకం, ఉద్యోగాల భర్తీ, సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన వంటి అంశాలు సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశముంది. అసెంబ్లీ సమావేశాలను కోవిడ్‌ ‌నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

గతంలో మాదిరిగానే పోలీస్‌, ‌వి•డియా, అధికారులు, శాసనసభ, మండలి సభ్యుల వెంట వచ్చే సహాయ సిబ్బందిని పరిమిత సంఖ్యలో అనుమతించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, పోలీసులు, వి•డియా ప్రతినిధులు కోవిడ్‌ ‌పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్న గత నిబంధనను పాక్షికంగా సడలించారు. ఎవరికైనా కోవిడ్‌ ‌లక్షణాలు ఉన్నట్లు అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా అసెంబ్లీ ఆవరణలో కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు వ్యాక్సినేషన్‌ ‌సెంటర్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైన వారికి తొలి, రెండో దశ కోవిడ్‌ ‌టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇకపోతే సమావేశాల నిర్వహణ, బందోబస్తు తదితర అంవాలను స్పీకర్‌ ఇప్పటికే శాసనసభ కార్యదర్శి  నర్సింహాచార్యులు, పోలీస్‌ అధికారులతో సవి•క్షించారు.

అసెంబ్లీలో సమాచారంపై సన్నద్ధంగా ఉండాలి : అధికారులకు సిఎస్‌ ఆదేశాలు
రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ‌బిఆర్‌ ‌కె భవన్‌లో గుకువారం భేటీ అయ్యారు. సమావేశాల సందర్భంగా వివిధ అంశాలు చర్చకు వొస్తుంటాయి. ఆయా శాఖల ఉన్నతాధికారులు సరైన సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సభలో చర్చకు వొచ్చే అంశం పై సంబంధిత శాఖల మంత్రులకు పూర్తి సమాచారాన్ని సిద్ధం చేసి ఇవ్వాలన్నారు. ప్రశ్నోత్తరాలతో పాటు పలు అంశాలపై చర్చలు జరుగుతుంటాయి. ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా అందుబాటులో ఉండాలన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి ఊదాసీనత పనికి రాదన్నారు.

అసెంబ్లీ పరిసరాల్లో నిషేధాజ్ఞలు : సిపి అంజనీ కుమార్‌
అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లోని 4 కి.వి•. పరిదిలో సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిషేధించినట్టు హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌ అం‌జనీ కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో జరిగే చర్చలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఈ నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం ఉదయం 6గంటల నుంచి ఈ నిషేదాజ్ఞలు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ముగిసే వరకూ వర్తిస్తాయని ఆయన తెలిపారు.

Leave a Reply