Take a fresh look at your lifestyle.

నాలుగు బిల్లులకు శాసనసభ ఆమోదం…సభ నిరవధిక వాయిదా

మంగళవారం పత్యేకంగా సమావేశమైన తెలంగాణ అసెంబ్లీ నాలుగు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. స్టాంపుల రిజిస్ట్రేషన్‌ ‌చట్టాలకు సంబంధించిన బిల్లు, అగ్రికల్చర్‌ ‌ల్యాండ్‌ ‌సవరణ బిల్లు, జీహెచ్‌ఎం‌సీ చట్ట సవరణ బిల్లు, క్రిమినల్‌ ‌ప్రొసీజర్‌ ‌సవరణ బిల్లులను ఆయా శాఖల మంత్రులు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

ఇండియన్‌ ‌స్టాంప్‌ ‌బిల్లు తెలంగాణ 2020, కన్వర్షన్‌ ‌నాన్‌ అ‌గ్రికల్చర్‌ ‌ల్యాండ్‌- 2020, ‌జీహెచ్‌ఎం‌సీ సవరణ బిల్లు – 2020, క్రిమినల్‌ ‌ప్రొసీజర్‌ ‌కోడ్‌ ‌సవరణ బిల్లు – 2020లకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి ప్రకటించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply