Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ ఎన్నికల తొలి విడుతలో.. అసోం, పశ్చిమ బెంగాలలో భారీ పోలింగ్‌

70 ‌శాతానికి పైగా నమోదు
న్యూఢిల్లీ, మార్చి 27 : అసోం, పశ్చిమబెంగాల్‌ ‌రాష్ట్రాల్లో పోలింగ్‌ ‌భారీగా నమోదుయ్యింది.  అసోంలో 72.16 శాతం, పశ్చిమబెంగాల్‌లో 79.79 శాతం పోలింగ్‌ ‌నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం అసోం, పశ్చిమబెంగాల్‌ ‌రాష్ట్రాల్లో తొలి విడుత పోలింగ్‌ ‌కొనసాగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ‌సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఆరు గంటల తర్వాత కూడా అప్పటికే క్యూ లైన్‌లలో ఉన్నవారికి తమ వొటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు.

 

అసోంలో మూడు విడుతల్లో, పశ్చిమబెంగాల్‌లో ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అందులో భాగంగా ఇవాళ తొలి విడుత పోలింగ్‌ ‌జరుగుతుండగా, ఏప్రిల్‌ 1‌న రెండో విడుత పోలింగ్‌ ‌జరుగనుంది. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌ ‌శాసనసభకు ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 29‌న తుది విడత పోలింగ్‌తో ఎన్నికలు ముగుస్తాయి. ఎన్నికల్లో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌, ‌బీజేపీలు ఒంటరిగా బరిలో నిలువగా.. కాంగ్రెస్‌ ‌పార్టీ వామపక్షాలతో కూటమిగా పోటీ చేస్తున్నది. త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తున్నది.

Leave a Reply