జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ చట్ట సవరణ కోసమే అసెంబ్లీ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యింది. ఐదు సవరణలు చేపట్టిన ఈ బిల్లును పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సభలో ప్రవేశపెట్టి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరంగా సమాధానం ఇచ్చారు.
అనంతరం బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. బిల్లుపై ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సభ్యులు తమ ఆమోదం తెలిపారు. అలాగే సవరణలపై చర్చించారు. సవరణల్లో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో 10 శాతం గ్రీన్ బ్జడెట్కు కూడా సభ ఆమోదం తెలిపింది.