Take a fresh look at your lifestyle.

భైంసాలో పథకం ప్రకారం మూకదాడి

  • హిందువులను టార్గెట్‌ ‌చేస్తూ దాడులు
  • రోహింగ్యాలను ఆదుకుంటున్న ప్రభుత్వం
  • హిందువులను మాత్రం పసట్టించుకోవడం లేదు
  • దస్పత్రిలో బాధితులను పరామర్శించిన బండి సంజయ్‌

భైంసాకు సీఎం కేసీఆర్‌ ‌వెళ్లాలి.. లేకుంటే తానే వెళ్తానని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రకటించారు.. భైంసా ఘటనలో గాయపడి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భైంసాలో ఎంఐఎం గూండాలు దాడి చేసిన ఘటనలో గాయపడిన వారిని ప్రభుత్వం, అధికారులు పాటించుకోలేదు.. బీజేపీయే స్పందించి వారిని యశోద ఆస్పత్రికి తరలించిందన్నారు.. ప్రస్తుతం విజయ్‌, ‌దేవారెడ్డి ప్రాణాపాయం నుండి బయటపడ్డారన్న బండి.. భైంసాలో ప్రత్యేక చట్టం ఉందా..? అంటూ ఫైర్‌ అయ్యారు.. రాష్ట్రంలో హోం మినిస్టర్‌ ఉన్నాడా..? రోహింగ్యాలకి షెల్టర్‌ ‌మాత్రం ఇస్తాడు.. భైంసాలో తమ వారికి ఏమి కావొద్దు అని పోలీసులకు ఫోన్‌ ‌చేసి బెదిరించారని ఆరోపించారు.

- Advertisement -

పేద వాళ్ల ఇళ్ళు దగ్ధం చేసినా సీఎం కేసీఆర్‌ ‌స్పందించలేదని బండి సంజయ్‌ అన్నారు. హిందువులు ఏమైనా పరవాలేదు అని ప్రభుత్వం అనుకుంటుందని విమర్శించిన ఆయన.. చేతగాని దద్దమ్మలు అని ఒప్పుకోండి.. వాళ్ల సంగతి ఏందో మేం చూస్తాం అని ఘాటుగా స్పందించారు.. భైంసాలో వేల మంది ఎలా జమ అయ్యారు.. 6 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎలా దాడులు జరిగాయి.. కత్తులు, రాళ్లు ఎలా వచ్చాయి… అంతా ప్లాన్‌ ‌ప్రకారమే జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనలో 40 మంది హిందువులని అరెస్ట్ ‌చేశారు.. ఫోన్‌ ‌చేస్తే విడుదల చేయరు..

ముగ్గురి వి•ద 307 కేసులు పెట్టారు.. ఏవో పోయాయని, ఏదో గుంజారని ఫిర్యాదు ఇప్పిస్తున్నా రని మండిపడ్డారు. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన ప్రభుత్వం.. పట్టనట్టు వ్యవహరిస్తోందన్న ఆయన.. అసలు బైంసాలో లా అండ్‌ ఆర్డర్‌ ‌లేదన్నారు. గాయపడిన వ్యక్తులను బీజేపీ అదుకుంటుంది.. ఎన్నికల తర్వాత అక్కడ భరోసా యాత్ర చేస్తామని ప్రకటించారు బండి సంజయ్‌.. ‌ఘటనా స్థలానికి స్థానిక ఎంపీని కూడా పంపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply