Take a fresh look at your lifestyle.

హంతకులను కఠినంగా శిక్షించాలి

జర్నలిస్టు సునీల్‌రెడ్డికి పలువురు నివాళులు – స్వంత గ్రామం ఎల్కుర్తిలో అంత్యక్రియలు

ములుగు జిల్లా పస్రాలో సోమవారం రాత్రి దారుణ హత్యకు గురైన సీనియర్‌ ‌ఫోటో జర్నలిస్ట్, ‌వరంగల్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌ ‌కోశాధికారి సునీల్‌ ‌రెడ్డి మృతదేహాన్ని మంగళవారం వరంగల్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌కు తీసుకొచ్చారు. ఈసందర్భంగా పలువురు నివాళ్ళురించారు. అనంతరం సునీల్‌ ‌రెడ్డి హత్యను ఖండిస్తూ, సంతాప సూచికగా హన్మకొండ, వరంగల్‌లో ప్రెస్‌ ‌క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో టియుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్‌, ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌ అలీ, జర్నలిస్టు సంఘాల నాయకులు దాసరి కృష్ణారెడ్డి, కరుణాకర్‌, ‌తుమ్మ శ్రీధర్‌ ‌రెడ్డి, పి.వెంకటేశ్వర్లు, లెనిన్‌, ‌శివకుమార్‌, ‌గాడిపల్లి మధు, వి.రమణ, రాజిరెడ్డి, ఎ.రాజేష్‌, ‌కె.కె, సంతోష్‌, ‌రాంచందర్‌ ‌రావు, జి.శ్రీనివాస్‌, ‌యు.రవీందర్‌, ‌కేశవమూర్తి, బుచ్చిరెడ్డి, ఎన్‌ఎస్‌.‌రావు తదితరులతో పాటు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జర్నలిస్టు సునీల్‌ ‌హత్య దారుణం: టిడబ్ల్యుజెఎఫ్‌ ‌రాష్ట్ర కమిటి
Assassins should be punished harshly1

సీనియర్‌ ‌ఫోటో జర్నలిస్ట్, ‌వరంగల్‌ ‌ప్రెస్‌క్లబ్‌ ‌కోశాధికారి సునీల్‌రెడ్డి హత్యను తెలంగాణ వర్కింగ్‌ ‌జర్నలిస్టస్ ‌ఫెడరేషన్‌ (‌టిడబ్లుజెఎఫ్‌) ‌రాష్ట్ర కమిటీ, ఇండియన్‌ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ‌వర్కింగ్‌ ‌జర్నలిస్టస్(ఐఎఫ్‌డబ్ల్యుజె)లు తీవ్రంగా ఖండించాయి. ఈ పాశవిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఫెడరేషన్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు, ఐఎఫ్‌ ‌డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వల్లాల జగన్‌, ‌వై.ప్రభాకర్‌, ‌పి.రాంచందర్‌, ‌కార్యదర్శి ఏవిఎన్‌ ‌రావు, టి.కృష్ణ, కోశాధికారి ఆర్‌.‌వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టు సునిల్‌ ‌హత్యను ప్రజలు, పాత్రికేయులు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని వారు కోరారు. హత్యకు గురైన సునీల్‌ ‌కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Assassins should be punished harshly2

సునీల్‌రెడ్డి భౌతికకాయానికి ప్రెస్‌క్లబ్‌లో నివాళులర్పిస్తున్న టియుడబ్ల్యుజె రాష్ట్ర నేతలు శేఖర్‌, ‌విరాహత్‌, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌, ‌మేయర్‌ ‌ప్రకాష్‌రావు, కుడా చైర్మన్‌ ‌మర్రి యాదవరెడ్డి, ఐఅండ్‌పిఆర్‌ ‌డిడి ముర్తుజా

సంతాపం: సునీల్‌రెడ్డి భౌతికకాయానికి వరంగల్‌ ‌పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌, ‌మేయర్‌ ‌గుండా ప్రకాష్‌రావు, కుడా చైర్మన్‌ ‌మర్రియాదవరెడ్డి, కెయు పాలక మండలి సభ్యుడు సుందర్‌రాజ్‌, ‌పలువురు టిఆర్‌ఎస్‌ ‌నేతలు, ఐఅండ్‌పిఆర్‌ ‌డిప్యూటి డైరెక్టర్‌ ‌ముర్తుజాలతో పాటు జర్నలిస్టులు, సునీల్‌ ‌కుటుంబ సభ్యులు నివాళులర్పించి సంతాపం ప్రకటించారు.

Tags: Sunil Reddy, Senior Photo Journalist, Warangal Press Club Publisher

Leave a Reply

error: Content is protected !!