Take a fresh look at your lifestyle.

అసోంలో మిలిటెంట్ల ఘాతుకం

  • ఏడు ట్రక్కులకు నిప్పుపెట్టిన దుండగులు
  • మంటల్లో ఐదుగురు సజీవ దహనం

గౌహతి,ఆగస్ట్ 27 : అసోంలో ఆగంతకుల ఘాతుకానికి ఐదుగురు బలయ్యారు. రాష్ట్రంలోని దిమా హసావో జిల్లా దియుంగ్బాల్రో ఏడు ట్రక్కులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ట్రక్కుల్లో ఉన్న ఐదుగురు సజీవ దహనమయ్యారు. మంటల్లో ఐదుగురు కాలి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇది ఉగ్రవాదుల చర్యగా భావిస్తున్నామని, దీనివెనక దిమాసా నేషనల్‌ ‌లిబరేషన్‌ ఆర్మీ హస్తమున్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. గురువారం రాత్రి దియుంగ్బాల్రో ట్రక్‌ ‌డ్రైవర్లు, ఇతరులపై ఆయుధాలతో ఐదుగురు మిలిటెంట్లు కాల్పులు జరిపారని, అనంతరం ఆ ట్రక్కులకు నిప్పంటించారని చెప్పారు. ఈ దాడి వెనక డిఎన్‌ఎల్‌ఎ అనే మిలిటెంట్‌ ‌సంస్థ ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు, అస్సామ్‌ ‌రైఫిల్స్‌కు చెందిన భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. కాలిపోయిన వాహనాల నుంచి ఐదు మృతదేహాలను వెలికితీశామన్నారు. మంటల్లో ఐదుగురు కాలి చనిపోయి నట్లు అధికారులు తెలిపారు. ఇది ఉగ్రవాదుల చర్యగా భావిస్తున్నామని, దీనివెనక దిమాసా నేషనల్‌ ‌లిబరేషన్‌ ఆర్మీ ఆఔఒం హస్తమున్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. గురువారం రాత్రి దియుంగ్బాల్రో ట్రక్‌ ‌డ్రైవర్లు, ఇతరులపై ఆయుధాలతో ఐదుగురు మిలిటెంట్లు కాల్పులు జరిపారని, అనంతరం ఆ ట్రక్కులకు నిప్పంటించారని చెప్పారు. ఈ దాడి వెనక డిఎన్‌ఎల్‌ఎ అనే మిలిటెంట్‌ ‌సంస్థ ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అస్సామ్‌ ‌రైఫిల్స్ ‌కు చెందిన భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. కాలిపోయిన వాహనాల నుంచి ఐదు మృతదేహాలను వెలికితీశామన్నారు.

Leave a Reply