Take a fresh look at your lifestyle.

మాజీ మావోయిస్టుకు ఏఎస్పీ రివార్డు

నిషేధిత మావోయిస్టు పార్టీ నందు పనిచేసి జిల్లా పోలీసుల ముందు ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు దళసభ్యుడు  పొడియం సంతోష్‌ ‌కు ప్రభుత్వం నుంచి అందిన రివార్డ్ ‌నగదు  1,00,000/- రూపాయల నగదును చెక్కు రూపంలో సోమవారం  అందజే యడం జరిగింది.ఈ సందర్భంగా ఏ. ఎస్పీ  అతనితో మాట్లాడుతూ ప్రస్తుతం అతని యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

అతని  యొక్క పునరావాస చర్యలలో భాగంగా  ప్రభుత్వం ద్వారా త్వరితగతిన నగదును అందేలా చేయడం జరిగిందని తెలిపారు.ఈ నగదును ఇతని  యొక్క బ్యాంకు ఖాతా నందు జమ చేసుకుని తన  ఉపాధి కొరకు  ఉపయోగిం చుకోవాలని సూచించారు.నిషేధిత మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసేవారికి ప్రభుత్వం తరపున అందవలసిన ప్రతిఫలాలను అందేవిధంగా చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.

Leave a Reply