Take a fresh look at your lifestyle.

సెప్టెంబర్‌లో చైనాలో ఏషియన్‌ ‌గేమ్స్

ఫిట్‌నెస్‌ ‌సమస్యలతో తప్పుకున్న సైనా నెహ్వాల్‌

‌హైదరాబాద్‌,‌మే2: ఇండియా సీనియర్‌ ‌షట్లర్‌, ‌రెండుసార్లు కామన్వెల్త్ ‌గేమ్స్ ‌చాంపియన్‌ ‌సైనా నెహ్వాల్‌ ‌సెప్టెంబర్‌లో చైనాలో జరిగే ఏషియన్‌ ‌గేమ్స్‌కు దూరం కానుంది. ఫిట్‌నెస్‌ ‌సమస్యల కారణంగా రాబోయే మెగా గేమ్స్ ‌సెలక్షన్‌ ‌ట్రయల్స్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. ఈ నెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్‌లోని గుత్తా జ్వాల అకాడలో ట్రయల్స్ ‌నిర్వహిస్తామని బ్యాడ్మింటన్‌ అసోసియేన్‌ ఆఫ్‌ ఇం‌డియా (బాయ్‌) ‌ప్రకటించింది. సైనాతో పాటు పలువురు ప్లేయర్లు ట్రయల్స్ ‌నుంచి విత్‌‌డ్రా అయినట్టు బాయ్‌ ‌సెకట్రరీ సంజయ్‌ ‌మిశ్రా తెలిపారు. సైనా చివరగా ఓర్లీన్‌ ‌మాస్టర్స్ ‌టోర్నీలో ఆడింది. కొన్నాళ్లుగా గాయాలతో ఇబ్బంది పడుతున్న ఆమె జనవరిలో ఆసియా మిక్స్‌డ్‌ ‌టీమ్‌ ‌చాంపియన్‌షిప్స్, ‌గతేడాది కామన్వెల్త్ ‌గేమ్స్ ‌ట్రయల్స్‌లో కూడా పాల్గొనలేదు.

కాగా, బీడబ్ల్యూఎఫ్‌ ‌టాప్‌20 ‌ర్యాంక్‌లో ఉన్న పీవీ సింధు (నం. 11), హెచ్‌ఎస్‌ ‌ప్రణయ్‌ (9), ‌సాత్విక్‌?‌చిరాగ్‌ (6), ‌పు•-లలెల గాయత్రి?ట్రీసా జాలీ (19) జంటలను నేరుగా ఏషియన్‌ ‌గేమ్స్‌కు ఎంపిక చేసింది. కిడాంబి శ్రీకాంత్‌ (23), ‌లక్ష్యసేన్‌ (24)‌త ఓపాటు సాయి ప్రణీత్‌, అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి తదితరులు ట్రయల్స్‌లో పాల్గొననున్నారు.

Leave a Reply