Take a fresh look at your lifestyle.

అశ్వధ్థామ రెడ్డి వర్సెస్ థామస్‌రెడ్డి

  • ఆర్టీసీ మజ్దూర్‌ ‌యూనియన్‌లో చీలిక
  • పదవి నుంచి తప్పుకోవాలని అశ్వథామరెడ్డికి హెచ్చరిక
  • ప్రభుత్వంతో సఖ్యతతోనే ఆర్టీసీకి మనుగడ అని చీలిక వర్గం వెల్లడి
  • బిజెపిలో ఎమ్మెల్సీ కోసం యూనియన్‌ను తాకట్టు పెట్టారని ఆరోపణ

ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ ‌యూనియన్‌లో చీలికకు రంగం సిద్దమయ్యింది. ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామరెడ్డిని కొనసాగించడం పట్ల థామస్‌ ‌రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘంలో ఏకపక్షంగా తీర్మానాలు చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అశ్వత్థామరెడ్డి టీఎంయూ నుంచి తప్పుకుంటున్నారని, ఆయన స్థానంలో మరొకరు బాధ్యతలు చేపడుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆదివారం భేటీ అయింది. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో అశ్వత్థామరెడ్డినే ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ తీర్మానం చేశారు. అయితే ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న థామస్‌రెడ్డి సహా ఆయన మద్దతుదారులు ఈ భేటీకి గైర్హాజరయ్యారు. ఇక ఆర్టీసీలో కార్మిక సంఘాలపై అనధికార నిషేధం విధించి కార్యకలాపాలు లేకుండా చేయటాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు కార్మికులను తీవ్రంగా వేధిస్తున్నారని, వెంటనే కార్మిక సంఘాలను మళ్లీ అధికారికంగా కార్యకలాపాలు చేపట్టేందుకు వీలు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరుతూ ఈ భేటీలో మరో తీర్మానాన్ని ఆమోదించారు. ప్రస్తుతం ఆర్టీసీలో కార్మిక సంఘాల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిన తరుణంలో, అశ్వత్థామరెడ్డి తప్పుకుంటున్నారంటూ అసత్య ప్రచారం చేసి లబ్ది పొందొద్దని సమావేశంలో నేతలు అదే సంఘంలోని మరికొందరు నేతలకు సూచించారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘం టీఎంయూ రెండుగా చీలిపోయింది.

తెలంగాణ మజ్దూర్‌ ‌యూనియన్‌(‌టీఎంయూ) జనరల్‌ ‌సెక్రటరీ అశ్వత్థామరెడ్డి నైతికంగా తన పదవికి రాజీనామా చేయాలని వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌థామస్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అనుబంధ సంఘంగానే టీఎంయూ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీలో ఎమ్మెల్సీ సీటు పొందేందుకు అశ్వత్థామ రెడ్డి టీఎంయూ కార్మికులను ఉపయోగించుకున్నారని ధ్వజమెత్తారు. జితేందర్‌ ‌రెడ్డిని టీఎంయూ అధ్యక్షుడిగా చేసి.. తనకు జనరల్‌ ‌సెక్రటరీ పదవి ఇస్తానని, ఆ తర్వాత బీజేపీలోకి వెళ్దామని అశ్వత్థామరెడ్డి చెప్పినట్లు థామస్‌ ‌రెడ్డి వెల్లడించారు. హబ్సిగూడలోని టీఎంయూ కార్యాలయంలో ఆ యూనియన్‌ ‌నాయకులు సమావేశమై భవిష్యత్‌ ‌కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం థామస్‌ ‌రెడ్డి వి•డియాతో మాట్లాడారు. మిగతా యూనియన్లు అన్నీ కార్మికుల సమస్యల గురించి ప్రజాస్వామ్యం పంథాలో ముందుకెళ్తుంటే.. సమ్మె తర్వాత అశ్వత్థామరెడ్డి ముఖం చాటేశాడని అన్నారు. తెలంగాణ మజ్దూర్‌ ‌యూనియన్‌ ‌మాత్రం కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో అశ్వత్థామరెడ్డి ఫెయిల్‌ అయ్యారు. టీఎంయూలో ఉన్న కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

యూనియన్లు పక్కన పెట్టి వెల్ఫేర్‌ ‌కమిటీలు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో కార్మికులకు మద్దతివ్వడంలో అగ్ర నాయకత్వం ఫెయిల్‌ అయింది. సమ్మెలో చనిపోయిన కుటుంబాలను అశ్వత్థామరెడ్డి పరామర్శించలేదు. ఆర్టీసీ కార్మికుల్లో చాలా మందికి కొరోనా వస్తే కూడా వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. కార్మికులను పట్టించుకోకుండా రోడ్డుపై వదిలేశారు. ట్రాన్స్‌ఫర్ల గురించి కూడా ఆయన మాట్లాడటం లేదు. టీఎంయూ జనరల్‌ ‌సెక్రటరీగా కొనసాగుతానని కొందరితో, కొనసాగనని మరికొందరితో చెప్పారు. జనరల్‌ ‌సెక్రటరీ పదవి నుంచి పక్కకు తప్పుకుంటానని సమ్మెకు ముందు చెప్పారు. అయినప్పటికీ తామంతా మద్దతుగా ఉండి.. అశ్వత్థామరెడ్డినే జనరల్‌ ‌సెక్రటరీగా కొనసాగమని చెప్పాం’ అని థామస్‌ ‌రెడ్డి అన్నారు. ఇప్పటికైనా అశ్వత్థామరెడ్డి అర్థం చేసుకుని జనరల్‌ ‌సెక్రటరీ పదవికి నైతికంగా రాజీనామా చేయాలని థామస్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణ మజ్దూర్‌ ‌యూనియన్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి అనుబంధ సంఘంగానే కొనసాగతుందని చెప్పానని అన్నారు. ప్రభుత్వ అండతోనే ఆర్టీసీ కాపాడబడుతుంది. ఆర్టీసీ కాపాడబడితేనే.. కార్మికులకు లాభం చేకూరుతుందన్నారు. ఆర్టీసీని రక్షించేది ప్రభుత్వం మాత్రమే. ప్రభుత్వం ద్వారానే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించుకోవాలని థామస్‌ ‌రెడ్డి స్పష్టం

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply