Take a fresh look at your lifestyle.

ఆశా వర్కర్ల సేవ అభినందనీయం

కొరోనా వైరస్‌ ‌కట్టడిలో ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వర్కర్స్ ‌గా భావించే డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఆశా వర్కర్ల సేవ అభినందనీయం, ఈ విధంగా వీరందరూ ప్రతి దశలో, ప్రతి స్థాయిలో కొరోనా వైరస్‌ ‌కట్టడికి వీపరీతమైన సేవ చేస్తున్నప్పటికీ గ్రామ స్థాయిలో మాత్రం కొరోనా వైరస్‌ ‌కట్టడిలో ముందున్నది మాత్రం ఆశా వర్కర్లే, గ్రామాలలో ఆశా వర్కర్లు ప్రతి ఇళ్లు తిరిగి ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని అందుకు తగ్గ విధంగా సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా ఒక వేళ గ్రామాలలో ఎవరైనా కొరోనా వైరస్‌ ‌బారినపడితే అటువంటి వారికి ప్రత్యేక ధైర్యాన్ని ఇచ్చి కొరోనా వైరస్‌ ‌నుండి కోలుకునేలా చేసేది మాత్రం ఆశా వర్కర్లే ఈ తరుణంలో ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్లి అందరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే క్రమంలో ఒకవేళ కొరోనా వైరస్‌ ‌బారినపడే అవకాశాలు ఉన్నాకానీ తమ అరోగ్యం కంటే కూడా గ్రామంలో ఉన్న ప్రజల గురించి అలోచించడమే ముఖ్యం అని భావించి గ్రామ స్థాయిలో కొరోనా వైరస్‌ ‌ను అంతం చేసేందుకు ఆశా వర్కర్లు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు, అందుకే ఆశా వర్కర్లు చేస్తున్న సేవను ప్రతి ఒక్కరు గర్వించక తప్పదు. ఆశా వర్కర్లు ఆయా గ్రామాలలో అనేక రకాల సమస్యలు ఎదుర్కుంటున్నప్పటీ భారత ప్రధాని నరేంద్ర మోడీ మాటలకు స్పూర్తిని పొంది కొరోనా వైరస్‌ను గ్రామ స్థాయిలో అంతం చెయ్యడమే లక్ష్యంగా పని చేస్తూ నిరంతరం గ్రామ ప్రజల గుండేలో నిలుస్తున్నారు. ఈ విధంగా కొరోనాను గ్రామ స్థాయిలో కట్టడి చేయడంలో ఆశా వర్కర్లు ముందు వరసలో ఉన్నారు.

గ్రామ స్థాయిలో కొరోనా వైరస్‌ ‌గురించి కానీ, కొరోనా వైరస్‌ ‌రాకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలి అనే అంశాల గురించి కానీ గ్రామీణ స్థాయిలో అంతగా అవగాహన ఉండదు, ఇటువంటి పరిస్థితులలో అందుకు తగ్గ విధంగా అవగాహనను కల్పిస్తున్నది ఆశా వర్కర్లే, గ్రామాలలో కొరోనా వైరస్‌ ‌సోకిన వారికి ఆ సమయంలో ఆశా వర్కర్లు ఇచ్చే సలహాలు, సూచనలు చాలా ముఖ్యమైనవి, విలువైనవి కూడా ఒక్క మాటలో చెప్పాలంటే వారి సలహాలు, సూచనలు కొరోనా బాధితులకు 1000 ఏనుగుల బలాన్నిస్తుంది,ఈ కొరోనా క్లిష్ట పరిస్థితులలోనే కాకుండా సాధారణ సమయంలో కూడా గ్రామాలలో ఫోలియో బారిన పడకుండా చిన్న పిల్లలకు ఫోలియో చుక్కలు వేసి ఫోలియో రహిత గ్రామలుగా మారుస్తూన్నారు.

కొరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో నిమగ్నం కావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడంతో బిజెపి శ్రేణులంతా కొరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు సేవ సప్తహీ కార్యక్రమంలో పాల్గోని అనేక స్థాయిలో అనేక సంద•ర్భాలలో నిరంతరం సేవ కార్యక్రమాలు నిర్వహిస్తునే ఉంది, కొరోనా వైరస్‌ ‌సోకిన పేద కుటుంబాలకు తమ ఇంటి వద్ద సరైన వ్యవస్థ , సరైన వసతి ఉండక ఐసోలేషన్‌ ‌కు ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు సొంతంగా తమ డబ్బును ఖర్చు చేసి కొరోనా వైరస్‌ ‌నుండి త్వరగా కోలుకునేందుకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు కొరోనా సోకిన వ్యక్తులకు పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు, అవే కాదు దేశంలో ఎక్కడైనా కొరోనా బాధితుల కోసం సేవ చేస్తున్నా రాజకీయ పార్టీ ఏదైనా ఉందా అంటే అది బిజెపి పార్టీనే అనే విధంగా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఆ విధంగా బిజెపి పార్టీ సేవ సప్తహీ కార్యక్రమంలో నిమగ్నం అయింది,

ప్రస్తుతం భారతదేశం కొరోనా వైరస్‌ ‌కారణంగా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొటున్నప్పటీ, ఇతర విషయాలలో నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి, నిజాయితీ అనేది ప్రజలలో బిజెపి ప్రభుత్వం మీద ప్రేమను రెట్టింపు చేసింది ఈ విధంగా దేశంలో ఉన్న ప్రజల సుఖ సంతోషాల కోసం నరేంద్ర మోడీ తీసుకుంటున్న చర్యలు, ఖచ్చితత్వంగా అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మీద అభిమానాని రెట్టింపు చేసింది, అందుకే భారతదేశంలో ఉన్న చాలా మంది బిజెపిని అభిమానిస్తున్నారు, అందుకు తగ్గట్లు గానే బిజెపి పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది.భారత ప్రధాని నరేంద్ర మోడీ తాను తీసుకునే ప్రతి నిర్ణయం వెనక దేశ అభివృద్ధి కి ఖచ్చితంగా ప్రణాళిక ఉండేవుంటుంది,అదే గొప్ప నాయకుడి, గొప్ప ప్రధాని లక్ష్యం.
– కేతూరి శ్రీరామ్‌,
ఉస్మానియా యూనివర్సిటీ, :9640300169.

Leave a Reply