Take a fresh look at your lifestyle.

ఇం‌ద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవం

 అమ్మవారికి తొలి సారెను సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌   

విజయవాడ,జూన్‌ 22 : ఇం‌ద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవం ప్రారంభమైంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి తొలి ఆషాడమాస సారెను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ‌సమర్పించారు. అనంతరం ఆయన డియాతో మాట్లాడుతూ.. ఆషాడ మాస సారెను దేవస్థానం తరపున అందజేయటం ఆనందంగా ఉందన్నారు. ఆషాఢంలో ప్రతి ఏడాది పక్క రాష్టాల్ర నుంచి కూడా వచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తారన్నారు.
కరోనా క్రమంలో నిబంధనలు పాటించాలని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. జూలై- 20వ తేదీ వరకు ఆషాఢ సారె మహోత్సవం కొనసాగుతుందని దుర్గ గుడి ఈవో సురేష్‌బాబు తెలిపారు. సారె సమర్పించడానికి వచ్చే భక్తులు ముందుగా ఆన్‌ ‌లైన్లలో బుకింగ్‌ ‌చేసుకోవాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే అమ్మవారికి సారె సమర్పించాలని వెల్లడించారు. భక్తులు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించి, మాస్క్‌లు ధరించాలని కోరారు. గుంపులు గుంపులుగా రావొద్దని భక్తులకు ఈవో సూచించారు.

Leave a Reply