Take a fresh look at your lifestyle.

‘‘వ్యవసాయ సంబంధిత పర్వం ఏరువాక’’

‘‘ఏరు వాక’’ అంటే ‘‘ఎద్దులను కట్టి దున్నుటకు సిద్ధపరచిన నాగలి’’ అని అని శబ్ద రత్నాకర నిఘంటువు స్పష్టం చేస్తున్నది. ‘‘ఏరువాక’’ అంటే దున్నుటకు ఆరంభం అని అర్థం. అనగా దుక్కి యొక్క ప్రారంభం. ఏరువాక వర్షరుతువు ఆరంభ దశలో రైతులు ఆచరించే పండుగగా భావించ బడుతున్నది. కర్షకులకు ఎద్దులే జీవిత సర్వస్వం, వాని పూజ కృతజ్ఞతా సూచకము, ప్రశంసనీయము. కనుక వ్యవసాయ దారులకు జేష్ఠ పౌర్ణమి ప్రధానమైన పండుగగా కనిపిస్తుంది. వర్షాలు కురిసి, భూమి పదును అయినచో, పునర్వసు కార్తెలో పునాస విత్తనాలు వేయడం పరిపాటి. పునర్వసు నుండి ‘‘పునాస’’ పదం ఏర్పడినట్లు చెబుతారు. పునర్వసు కార్తెలో పునాస విత్తనాలు వేయడం సనాతన సంప్రదాయం. జ్యేష్ఠ పూర్ణిమను ‘‘ఏరువాక పూర్ణిమ’’ అంటారు.”

జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా

భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, ధర్మాలు, ప్రజలకు కేంద్రస్థానమై, అఖండ మరియు అవిభాజ్యమైన  సంస్కృతికి మూలాధారమైన భారతావని, ప్రాచీన కాలం నుండి, వ్యవసాయ ప్రధాన దేశం కావడం గ్రామీణులలో, అధిక సంఖ్యాకులు రైతులే కావడం, ఎడ్లు మరియు నాగళ్ళతో విడదీయరాని బంధం, అనుబంధం ఏర్పరుచు కోవడాలు మనదేశానికి ప్రత్యేకం. కొన్ని పంచాంగాలలో, జ్యేష్ఠ పూర్ణిమకు వృషభ పూజా, హల ప్రవాహ: మొదలైన పేర్లు పేర్కొన బడుతున్నాయి.

ఎద్దులను పూజించడం, నాగలి సాగించడం, ఆనాటి విధి కృత్యాలని చెప్పబడు తున్నాయి. సురవరం ప్రతాపరెడ్డి పేర్కొన్న ప్రకారం ‘‘ఆంధ్ర దీపికా నిఘంటువు’’ను బట్టి ‘‘ఏరు’’ అనగా ‘‘సర్వ అవయవములు గల నాగలికి,  ఎడ్లను పూనినది’’ అని అర్థం. ‘‘ఏరు వాక’’ అంటే ‘‘ఎద్దులను కట్టి దున్నుటకు సిద్ధపరచిన నాగలి’’ అని అని శబ్ద రత్నాకర నిఘంటువు స్పష్టం చేస్తున్నది. ‘‘ఏరువాక’’ అంటే దున్నుటకు ఆరంభం అని అర్థం. అనగా దుక్కి యొక్క ప్రారంభం. ఏరువాక వర్షరుతువు ఆరంభ దశలో రైతులు ఆచరించే పండుగగా భావించ బడుతున్నది.

As far as agriculture is concerned ’

కర్షకులకు ఎద్దులే జీవిత సర్వస్వం, వాని పూజ కృతజ్ఞతా సూచకము, ప్రశంసనీయము. కనుక వ్యవసాయ దారులకు జేష్ఠ పౌర్ణమి ప్రధానమైన పండుగగా కనిపిస్తుంది. వర్షాలు కురిసి, భూమి పదును అయినచో, పునర్వసు కార్తెలో పునాస విత్తనాలు వేయడం పరిపాటి. పునర్వసు నుండి ‘‘పునాస’’ పదం ఏర్పడినట్లు చెబుతారు. పునర్వసు కార్తెలో పునాస విత్తనాలు వేయడం సనాతన సంప్రదాయం. జ్యేష్ఠ పూర్ణిమను ‘‘ఏరువాక పూర్ణిమ’’ అంటారు. ఈనాడు ఎద్దులకు మై కడిగి, కొమ్ములకు రంగులు వేసి, గజ్జలు, గంటలు, అద్దాలు, కుచ్చులు మెడకు కట్టి, అలంకరించే ఆచారం అనాదిగా ఆచరణలో ఉంది. పొద్దున్నే పొంగలి (పులగం) చేసి ఎద్దులకు పెట్టి, వాటిని వేసే గాడికి, దూప దీప నివేదన మొనర్చి, తమ జీవిత సర్వస్వాలు అయిన ఎద్దులకు, కృతజ్ఞత తెలుపుకునే వేడుకే ‘‘వృషభోత్సవం’’. దీని గురించి ‘‘అనడుత్సవం’’ పేరుతో అధర్వణ వేదములో వివరించ బడింది. కన్నడిగులు ‘‘కారుణి పబ్బం’’ అంటారు. ఏరువాక పౌర్ణమిని ‘‘వృషభ యజ్ఞం’’ అంటారు. ఏరువాక పండుగ భారతావనిలో అతి ప్రాచీనమైంది. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి కృష్ణదేవరాయ సార్వభౌముడు రైతన్నల కృషిని అభినందించి తగిన రీతిలో రైతు సోదరులను ప్రోత్సహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాగే శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ.. ఒక బంగారు రంగు నాగలిని కర్షకులకు అందించినట్లు గాథలున్నాయి.

జైమినీయ ‘‘న్యాయ మాలా’’ గ్రంథమందు ‘‘హలాధికరణం’’లో, ఈ పండుగ గురించి పేర్కొన బడింది. ఔత్తరాహికులు వృషభ యజ్ఞం, జేష్ఠ పౌర్ణమి నాడు చేయడం ఆచారమై ఉంది. దీని విధి నిషేధికము శ్రౌత సూత్రమున ఉంది. ఇది తొలుత హల కర్మము. అంకురారోపణం అనే విప్రుల కర్మ సంబంధంగా పరాశర, బోధనాది గృహ్య సూత్రములలో పేర్కొన బడింది. వ్యవసాయం బ్రాహ్మణులు చేయుట మానిన తర్వాత, అమంత్రకంగా ఆచరించడం ప్రారంభమైనదిగా భావించ బడుతున్నది. ఇందుకు సంబంధించి, ఏరువాక, నాగలి గురించి జానపద గేయాలు, పాటలు, సినీ సాహిత్యంలో ప్రత్యేక ప్రస్తావన అంశాలుగా ఉన్నాయి. పారస్కరుడు తన గృహ సూత్రాలలో… హల కర్మకు ‘‘జేష్ఠ, అని స్వాతి’’ నక్షత్రాలు మంచివని పేర్కొన్నాడు. ఈనాడు ఓషధీపతి అయిన చంద్రుడు, హల కర్మకు మంచి నక్షత్రమైన జేష్ఠకు, దగ్గరగా ఉంటాడు. వ్యవసాయ దారులు ఈ రోజున ఎవరికీ అప్పులు ఇవ్వరు. డబ్బులు పెట్టి ఏమి కొనరు. కావలసిన వస్తు సామగ్రి మందు రోజునే తెచ్చి పెట్టుకుంటారు. ఏరువాక సాగిన నాడు నిప్పు కూడా పెట్టరు. ఇంట్లోని వస్తువులు బయటికి తీసుకెళ్లరు.

‘‘ఎద్దు లేని సేద్యం సద్ది లేని పయనం, ఎడ్లు, వడ్లు ఉన్నవాడిదే వ్యవసాయం… ఎక్కువ వెల పెట్టి గుడ్డను తక్కువ వెల పెట్టి గొడ్డును కొనకూడదు… కర్ర మన్ను అయితే కాపు బతుకుతాడు. దుక్కి గల భూమి దిక్కు గల మనుష్యుడు చెడడు’’.ఇలాంటి సామెతలు వల్ల ఎద్దుల, దుక్కి ప్రాముఖ్యం స్పష్టం అవుతున్నది.‘‘బండలు పగిలే భరణి కార్తె ఎండలు వెనకబడి, మృగశిర కార్తెతో ముంగిళ్ళు చల్లబడతాయి’’. ఆ పైన ఆరుద్ర వాన… అదనపు వాన. ఇది వ్యవసాయానికి అనువైన కాలం. ‘‘రోహిణిలో విత్తనాలు చల్లితే, రోళ్ళు నిండని అల్పపు పంట’’ అని రైతులకు అనుభవ పునరుక్త అంశం.
– రామ కిష్టయ్య సంగనభట్ల…9440595494

Leave a Reply