రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జిల్లా అంత ఘనంగా ప్రజలు నిర్వహించుకున్నారు , తెరాస పార్టీ నాయకులూ వేడుకల్లో భాగంగా రాజ్యాంగ నియమా వళికి వ్యతిరేకంగా జెండా అవిష్కరణ నిర్వహించారు జిల్లా కేంద్రానికి అనుకోని వున్నా కాలనీలలో నాలుగవ వార్డులో జాతీయ జెండాకు బదులుగా పార్టీ జెండా ఆవిష్కరిస్తే కేస ముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో ఏకంగా జాతీయ జెండా గద్దె పక్కనే వున్నా దానిపై కాకుండా తెరాస పార్టీ గద్దె పై అవిష్కరించారు .
ఇదేమని ప్రజా తంత్ర ప్రశ్నించగా మాకు ఈ జెండానే ఈ గద్దె పైనే ఎగురవేయమని పార్టీ నాయకులూ తెలిపారని బాహాటంగానే చెప్పడం విడ్డురం కలిపిస్తుంది ఇంకొన్ని చోట్ల పతాకానికి బదులుగా పార్టీ గులాబీ జెండా అవిష్క్రిరించారు . దీనిపై జిల్లా వ్యాప్తంగా విచారన జరిపించి భారత రాజ్యాంగ జెండా వందన నియమావళి అనుసరించి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల దేశ భక్తులు కోరుతున్నారు .