Take a fresh look at your lifestyle.

అం‌తరాత్మ సాక్షిగా

పగలు చుక్కల్ని వేటాడాలన్న
వెన్నెల నిరీక్షణ ఫలిస్తుందా !

ఆకాశాన్నికి నిచ్చెన వేయాలన్న
పుడమి ఆశ చిగురిస్తుందా. !

తూర్పు – పడమరలు
తమను తాము ఓదార్చుకోవాలన్న
అభిమతం నెరవేరుతుందా !

కడలి కెరటాలు
నింగిని ముద్దాడాలన్న
కోరికకు రెక్కలొస్తాయన్న !
మనిషి అంతరంగపు
మనస్సు ఆరాటమిది !!
ప్రకృతి ని యెదురొడ్డే
సంకల్పబలమిది.. !!

స్వార్థపు ఆలోచనలతో
తనను తానే మోసం
చేసుకుంటూ..
ప్రకృతి -మనిషి
రెండు ధ్రువాల మధ్య
మనిషి ఆలోచన
రాటుదేలి.. ప్రకృతి నీడకే
ఎసరు పెట్టింది !

గెలుపు ఎవరిదైతేనేమి..?
ఒకరినొకరు పోటీ పడుతూ..
కాలపు పరుగు పందెంలో
ఒలంపిక్‌ ‌ఛాంపియన్లు
కావాలన్న.. మనిషి మస్తిష్కము
ప్రకృతి కే సవాళ్లు
విసురుతుంటుంటే..
ప్రకృతి తానేమి తక్కువ
కాదన్నట్లు.. హరికేన్లు
సునామీలు.. కొరోనా రూపాలల్లో
యావత్తూ ప్రపంచాన్ని
గజ గజ వణికిస్తుంటుంటే
బిక్కమొఖం వేసుకొని
మనిషి ! నిదురలేని
రాత్రుల్ని లెక్కబెడుతుండు. !!

ఎత్తుకు పై ఎత్తులల్లో..
మానవాళి ఉనికే
ప్రశ్నార్తకమైందీపుడు.?
కళ్ళు తెరిచి – ఇకానైనా
మనిషి ప్రకృతి తో
స్నేహపు చిరునవ్వుల
చెట్టపట్ట లేసుకొని..
సహజీవనం చేయాలి !

వాతావరణ ప్రశాంతతకు
భంగం కలుగకుండా .
వసుధైక కుటుంబం కోసం
ఉద్యమించాలి !!

అణ్వస్త్ర రహిత సమాజానికై
ప్రకృతి వనరుల
సంరక్షణకై -భూగోళ
పరిరక్షణకై దీక్ష పునాలి..!

అంతరాత్మ సాక్షిగా
కంకణ బద్దులై
దేశ సరిహద్దుల చెరిపే
విశ్వమానవ సౌభ్రాత్వపు
తలుపులు తెరవాలి !!

పట్నం నగర కాంక్రీట్‌
అరణ్యాలల్లో..
మానవత్వపు పరిమళలు
పూచే పచ్చని మొక్కలు
ఏపుగా ఎదగాలి..!

కల్ల కపటం ఎరుగని
పల్లె అందాలను ప్రకృతి తో
మమేకం చేసుకుంటూ..
రేపటి తరాల మనుగడకై
పునాదులు పేర్చాలి.!!

– రవీందర్‌ ‌కొండ
9848408612

Leave a Reply