Take a fresh look at your lifestyle.

నాడు స్పానిష్‌ ‌ఫ్లూ..నేడు కొరోనా బాధితులు శ్రామిక ప్రజలే..!

రెక్కాడితే కానీ డొక్కాడని శ్రామిక ప్రజలను ఇంతగా కష్టాలకు గురి చేస్తున్న కొరోనా గురించి చరిత్రపుటల్లో నమోదు ఏ తీరుగా అవుతుంది..? ఈ ప్రశ్నకి సమాధానము వెతకాలి అనుకున్నప్పుడు, గత వందేళ్లలో ఎప్పుడైనా ఇటువంటి మహమ్మారి భూమండలాన్ని కబళించిందా..? అన్న ప్రశ్న పుడుతుంది. ఈ ప్రశ్నకి సమాధానం అవును వందేళ్ల క్రితం మహమ్మారి ‘‘స్పానిష్‌ ‌ఫ్లూ’’ భూమండలాన్ని కబళించింది. ఇది యూరోప్‌లో 1918లో పుట్టింది..సూమారు ఏడాది  వరకు ‘స్పానిష్‌ ‌ఫ్లూ’ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపింది.. అనే సమాధానం దొరుకుతుంది.”

Aruna
అరుణ, న్యూఢిల్లీ

నేడు జరుగుతున్న ప్రతి ఘటన భవితకి మనం అందించే చరిత్ర అనే సత్యాన్ని ఎవ్వరూ కాదన లేరు. ఈ కోణంలో ఆలోచించినప్పుడు నేడు మానవాళి అనుభవిస్తున్న కొరోనా కష్టాలు కూడా భవితకు చరిత్రే. ప్రస్తుత కొరోనా కష్టాలలో అత్యధికంగా నష్టపోతున్న వారు, రెక్కల కష్టం చేసేందుకు పట్టణానికి వచ్చి కష్టపడినంతకాలం కష్టపడుతూ పొట్ట పోషించుకుని కొరోనా వైరస్‌ ‌రోగం వ్యాప్తి భయం పట్టణాల నుంచి తరిమివేస్తుంటే తిరిగి గ్రామాలకు వట్టిచేతులతో వెళ్ళిపోతున్న శ్రామిక బాటసారులే. రెక్కాడితే కానీ డొక్కాడని శ్రామిక ప్రజలను ఇంతగా కష్టాలకు గురి చేస్తున్న కొరోనా గురించి చరిత్రపుటల్లో నమోదు ఏ తీరుగా అవుతుంది..? ఈ ప్రశ్నకి సమాధానము వెతకాలి అనుకున్నప్పుడు, గత వందేళ్లలో ఎప్పుడైనా ఇటువంటి మహమ్మారి భూమండలాన్ని కబళించిందా..? అన్న ప్రశ్న పుడుతుంది. ఈ ప్రశ్నకి సమాధానం అవును వందేళ్ల క్రితం మహమ్మారి ‘‘స్పానిష్‌ ‌ఫ్లూ’’ భూమండలాన్ని కబళించింది. ఇది యూరోప్‌లో 1918లో పుట్టింది సూమారు ఏడాది  వరకు ‘స్పానిష్‌ ‌ఫ్లూ’ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపింది.. అనే సమాధానం దొరుకుతుంది.

Aruna ariticles prajatantra newsఈ మహమ్మారి బారిన పడిన వారు ఎవరు అన్న ప్రశ్న పుడితే.. తెల్లని మేని ఛాయ, ఆంగ్లం మాట్లాడటం వచ్చిన వారు, డబ్బు దస్కం వున్నా ప్రముఖుల పేర్లే ఎవరైనా ముందుగా చెబుతారు.. ఆ మేరకు ఈ మహమ్మారి బారిన పడిన ప్రముఖులు..స్పానిష్‌ ‌ఫ్లూలో అనారోగ్యం పాలు అయిన వారిలో స్పానిష్‌ ‌రాజు 13వ ఆల్ఫాన్సో, జర్మనీ చక్రవర్తి 2వ విలియం, అమెరికా రాష్ట్రపతి ఉడ్రో విల్సన్‌, ‌బ్రిటన్‌ ‌ప్రధాని డేవిడ్‌ ‌లోఎడ్‌, అమెరికా ప్రెసిడెంట్‌ (1943 -1945 ‌మధ్య) ఫ్రాంక్లిన్‌ ‌రూజ్వేల్డ్, ‌చర్చిల్‌ ‌భార్య క్లామినటైన్‌ ‌చర్చిల్‌, ఇథియోపియా రాజు మొదటి హైలె సెలసియే, వర్డ్ ‌డిస్ని, మూకీ సినిమాల ప్రఖ్యాత అభినేత్రి మేరీ పీక్‌ ‌ఫో, పేల్‌ ‌హార్స్ ‌పేల్‌ ‌రైడర్‌ ‌నవల రచయిత కేతరిన్‌ ‌కోటర్‌, ‌ప్రముఖంగా ఉన్నారు. మన దేశంలో స్పానిష్‌ ‌ఫ్లూ బారిన పడిన వారిలో ప్రముఖులు మహాత్మా గాంధీ, ప్రముఖ హిందీ కవులు సూర్య కాంత్‌ ‌త్రిపాఠి నిరాలా, ముంషీ ప్రేమ్‌ ‌చంద్‌ ‌వున్నారు. సూర్య కాంత్‌ ‌త్రిపాఠి నిరాలా స్పానిష్‌ ‌ఫ్లూ కారణంగా భార్యని కోల్పోయారు. బీహార్‌ ‌కి చెందిన ఈయన గంగానది ఒడ్డున భార్యకి అంత్యక్రియలు చేస్తూ తాను చుసిన దాని గురించి తన రచనలలో ఇలా రాసారు ‘‘గంగానదిలో శవాలు గుట్టలుగా పేరుకుపోవడం వలన వరద వచ్చేలా వుంది’’ శవాలను కాల్చటానికి కర్రలు లేక ప్రజలు చనిపోయిన వారిని నదిలో వేసేసి వెళ్లిపోయేవారని ఆనాటి కవులు రచయతలు తమ రచనలలో రాసారు. స్వయంగా గాంధీజీకి ఈ స్పానిష్‌ ‌ఫ్లూ సోకినపుడు గాంధీజీ పరసనల్‌ ‌సెక్రటరీ మహాదేవ్‌ ‌దేశాయ్‌ 10 ‌నవంబర్‌ 1918‌లో ఇలా రాసారు ‘‘ఆశ్రమం అంతా స్పానిష్‌ ‌ఫ్లూ వ్యాపించి వుంది’’. స్వయంగా గాంధీజీ తన అనునయి అయిన గంగ బెన్‌ ‌మాజూమ్ధర్‌కి లేఖరాస్తు ‘‘నేను ఇంకా రోగం వలన మంచానికి అతుక్కుని వున్నాను. డాక్టర్లు రెస్ట్ ‌తీసుకోమని చెబుతున్నారు. అయినంత మాత్రాన నీకు లేఖ రాయకుండా ఎలా ఆగుతాను’’ అని రాసారు. ప్రముఖుల బాధలు ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమంటే…. ఆనాటి వార్తాపత్రికల కథ•నాలు ప్రకారం స్పానిష్‌ ‌ఫ్లూ వలన ఆనాటి భారతీయ జనాభాలో 6నుంచి 7శాతం ప్రజలు మరణించారు.

Aruna ariticles prajatantra newsముంబై, మద్రాస్‌, ఉత్తర్‌ ‌ప్రదేశ్‌, ‌బీహార్‌ ఇలా దేశవ్యాపితముగా స్పానిష్‌ ‌ఫ్లూ వ్యాపించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ ‌ప్రభుత్వం తరుపున యుద్ధంలో పాల్గొన్న భారతీయ సైనికులు యుద్ధం నుంచి తిరిగి వస్తూ స్పానిష్‌ ‌ఫ్లూ వ్యాధిని భారత దేశానికీ తీసుకు వచ్చేవారు. భారతీయ సైనికులు ఓడలలో ముంబైలో దిగి అక్కడినుండి రైలు మార్గంలో భారతదేశంలోని పలుప్రాంతాలలో వున్నా తమ ఇళ్ళకి చేరుతున్నప్పుడు ఈ వ్యాధి దేశం మొత్తం వ్యాపించేది. ఈ వ్యాధిని వ్యాపింప చేయటంలో బ్రిటీషువారు దేశ సంపదను దోచుకొని తమ దేశానికీ సులభంగా రవాణా చేసుకోవటానికి కట్టిన రైల్వే ఉపయోగ పడింది. స్పానిష్‌ ‌ఫ్లూ  ప్రభావానికి అధికంగా గురి అయిన బీహార్‌ ‌రాష్ట్రంలో గంగ నదికి ఎగువ ప్రాంతాలలో బ్రిటిష్‌ ‌ప్రభుత్వం రైలు లైన్లు వేయకపోవడంతో, ఆ ప్రాంత ప్రజలు బ్రిటిష్‌ ‌వారు మాయతో చేసే అభివృద్ధికి నోచుకోకపోయినా రైల్వే లైన్స్ ‌లేకపోవటం వలన స్పానిష్‌ ‌ఫ్లూ తమ ప్రాంతంలోకి వ్యాపించక ప్రజలు ప్రాణాలు కాపాడుకున్నారు.

Aruna ariticles prajatantra news
స్పానిష్‌ ‌ఫ్లూ భారతదేశానికి రెండు విడతలుగా వచ్చింది. మొదటిసారి వసంత రుతువులో వచ్చి, వేసవి అంతా ప్రజలను పట్టి పీడించింది. అటుపై శరదృతువులో మరింత ఉధృతంగా వచ్చి, చలికాలం మొత్తం ప్రజలపై ప్రతాపాన్ని చూపింది. ఉత్తర భారతదేశంలో స్పానిష్‌ ‌ఫ్లూని ప్రజలు చలికాలంలో సతాయిస్తున్న కొత్తరకం జరం అనుకొన్నారు. ఆరోజుల్లో ముంబై మహానగరంలో సెప్టెంబర్‌ ‌మాసంలో స్పానిష్‌ ‌ఫ్లూ తన ప్రతాపాన్ని తీవ్రంగా చూపుతూ అక్టోబర్‌ ‌వరకు కొనసాగుతూ ప్రతి వేయి మంది పాజిటివ్‌ ‌కేసులలో 55  మంది ప్రాణాలు తీసింది ..మద్రాస్‌ ‌లో ఈ స్పానిష్‌ ‌ఫ్లూ అక్టోబర్‌ ‌మాసంలో ప్రవేశించి వేయి మంది పాజిటివ్‌ ‌కేసులలో 17  మందిని పొట్టన పెట్టుకుంది. కలకత్తాలో నవంబర్‌ ‌మాసంలో ఈ వ్యాధి వేయి మంది పాజిటివ్‌ ‌కేసులలో 9 మందిని పొట్టన పెట్టుకుంది. ఇలా ఉత్తర, దక్షిణ భారతదేశాలకు ఈ వ్యాధి వ్యాపించింది. స్పానిష్‌ ‌ఫ్లూ నెమ్మదిగా భారత దేశం మొత్తం విస్తరించింది.

Aruna ariticles prajatantra newsఈ స్పానిష్‌ ‌ఫ్లూ వలన అత్యధికముగా చనిపోయింది ఆనాటి మహిళలు. మగవారు పిల్లలపై కన్నాకూడ మహిళలపై స్పానిష్‌ ‌ఫ్లూ తీవ్ర ప్రభావం చూపింది. స్పానిష్‌ ‌ఫ్లూ వలన భారతీయ జనాభా లెక్కలలో మార్పులు వచ్చాయి. కుటుంబాల్లో మధ్య వయస్కులు చనిపోయే వారు. ఆదాయం సంపాదించే వారు లేక ముసలివారు కార్మికులుగా అవతారం ఎత్తి పొట్ట పోషణకు బయలుదేరారు. ఎంతోమంది పిల్లలు ఆనాథలు అయిపోయారు. దేశంలో బ్రిటిష్‌ ‌పాలనలో ఉన్న ప్రజలకి సామజిక భద్రత లేక పిల్లలు ఆనాథ•లు అయ్యారని మాయం అయిపోయారని ఆనాటి వార్తా పత్రికలూ రాశాయి. స్వతంత్రం వచ్చి 72 ఏళ్ళు అయిన భారత దేశంలో నేడు కూడా ఇదే మాటని మనం వార్తా పత్రికలలో చూస్తున్నాం. కొరోనా భయం తరిమివేస్తుంటే పట్టణాల నుంచి గ్రామాలకు వెనక్కి పోతున్నవారిలో ఎంతమంది ఇంటికి చేరుతారో..? యెంత మంది మిస్సింగ్‌ ‌లిస్ట్‌లో తేలుతారో..? తెలియదు. కాలి నడక బాటసారి శ్రామికులకు నేడు సామాజిక భద్రత లేదు. ఆనాడు  స్పానిష్‌ ‌ఫ్లూ గురించి ప్రజలకి అజ్ఞానం మెండుగా వుండినది.  ఫలితంగా నేటి లాగే విదేశీయులను తూలనాడటం చేసేవారు. నేటికీ మల్లే గోమూత్రాలు.. తాయెత్తులు.. మంత్రాల కోసం ప్రజలు మాట్లాడేవారు. అప్పటి బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ప్రజల్లో భయాన్ని తొలగించటానికి గాని ప్రజల మూఢ నమ్మకాన్ని వదిలించటానికి కానీ ఏమి ప్రయత్నించలేదు. అప్పుడప్పుడే ఎదుగుతున్న హిందూ మహా సభ ‘‘స్పానిష్‌ ‌ఫ్లూ భారత దేశాన్ని పట్టి పీడించటానికి కారణం దేశంలో వున్న బక్కచిక్కిన పశువుల దీనస్థితి’’ కారణం అని ప్రకటించింది.

Aruna ariticles prajatantra news1918 -1919 లలో స్పానిష్‌ ‌ఫ్లూ ప్రకోపం చూపిస్తున్నప్పుడు భారతదేశంలో దేశ అవసరాలకి సరిపడా ఆరోగ్య వ్యవస్థ లేదు. నేడు అదే పరిస్థితి. ఆనాడు ప్రజలకి అర్థం అయ్యింది. బ్రిటిష్‌ ‌ప్రభుత్వం తమ కోసం ఏమి చేయదు అని పైగా రోగం బారిన పడిన బ్రిటిష్‌ ‌సైనికులకు వైద్యం అందిస్తూ భారతీయులపై బ్రిటిష్‌ ‌ప్రభుత్వం శీతకన్ను వేస్తున్నది. అంతేనా స్పానిష్‌ ‌ఫ్లూ రోగంతో మరణించిన వారికి అంత్య క్రియలు చేయాలి అంటే కూడా ప్రభుత్వ పర్మిషన్‌ ‌తీసుకోవాలి. సరిగ్గా ఈ సమయంలో పంజాబ్‌లో జలియన్‌ ‌వాలా బాగ్‌ ‌ఘటన జరిగింది. అప్పుడే స్పానిష్‌ ‌ఫ్లూ నుంచి కోలుకున్న గాంధీజీ నిరసనగా సత్యాగ్రహ పిలుపుని ఇచ్చారు. అటుపై సహాయ నిరాకరణ ఉద్యమం. ప్రజా ఆగ్రహం పెల్లుబికి బ్రిటిష్‌ ‌వారు తెరపైకి కనపడేలాగా భారత దేశాన్ని వీడారు. యూరప్‌ ‌నుండి భారతదేశానికి సైనికుల ద్వారా వచ్చిన స్పానిష్‌ ‌ఫ్లూ సుమారు రెండు కోట్ల భారతీయులను బలి తీసుకుంది. భారత దేశంలో ప్రబలిన ప్లేగు గురించి, బెంగాల్‌ ‌కరువు గురించి భారతీయులకి తెలుసు కానీ అంతకంటే పెద్ద మహమ్మారి స్పానిష్‌ ‌ఫ్లూ గురించి భారతీయులకి తెలియదు ఎందుకు..? ఎందుకంటే ఆనాటి స్పానిష్‌ ‌ఫ్లూ గురించి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన గవర్నమెంటు రికార్డస్ ‌సరిగ్గా లేవు. ఈ మహమ్మారి రోగం ఏ వైరస్‌ ‌వలన.. ఎలా.. వచ్చింది..? మందు కనిపెట్టటం వంటి వాటిపై తగు పరిశోధన ఆనాడు చేయలేదు.

Aruna ariticles prajatantra news
1951లో జోన్‌ ‌హిల్టన్‌ అనే 25 ఏళ్ల అమెరికా బయలాజిస్టు అలష్కకి పోయి అక్కడ పాతిపెట్టిన సమాధులను తవ్వి స్పానిష్‌ ‌ఫ్లూ వైరస్‌ ‌నమూనాలను సేకరించి, స్పానిష్‌ ‌ఫ్లూను స్టడీ చేయటానికి  ప్రయత్నం చేసారు. అటుపై 2005లో వైరస్‌ ‌పూర్తి స్థాయిలో రీకన్సట్రక్షన్‌ అయి, హెచ్‌1, ఎన్‌1 ‌వైరస్‌లుగా స్పానిష్‌ ‌ఫ్లూని ప్రకటించారు. ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన ఫ్లూ ఏమైనా ఉంది.. అంటే అది స్పానిష్‌ ‌ఫ్లూయే అని అన్నారు. అంతటి మహమ్మారి మీద ప్రభుత్వం దృష్టి పెట్టి దానికి సంబంధించిన వివరాలను రికార్డు చేయలేదు. ఫలితంగా ఈ మహమ్మారి చరిత్ర నమోదు కాలేదు.

ఇటీవల కాలంలో 2018 వందేళ్ల స్పానిష్‌ ‌ఫ్లూ మహమ్మారి సెంటినరీ నేపథ్యంలో స్పానిష్‌ ‌ఫ్లూ చరిత్రని నమోదు చేయటానికి ఈ మధ్య కాలంలో కొంతమంది రచయితలు, మెడికల్‌ ‌రైటర్స్, ‌సైంటిస్టులు, స్పానిష్‌ ‌ఫ్లూ మీద కొన్ని పరిశోధనలు చేసి కొన్ని రచనలు చేశారు. ఈ పరిశోధనలలో బ్రిటిష్‌ ‌సైన్స్ ‌జర్నలిస్ట్, ‌రచయిత, లారా స్పిన్నయ్‌ ‌పుస్తకం ‘‘పేల్‌ ‌రైడర్‌’’ ‌రాసిన పుస్తకం బాగా పాపులర్‌ అయ్యింది. ఈ భూమండలం మీద  ఏ మహమ్మారి అయినా తన ప్రతాపాన్ని చూపేది రెక్కాడితే గాని డొక్కాడని శ్రామిక ప్రజల మీదే.. శ్రామిక ప్రజలంటే చిన్న చూపు ఉన్న రాజ్యం శ్రామిక ప్రజల చరిత్రను పట్టించుకోదు. అందుకే శ్రామిక ప్రజలను కబళించిన స్పానిష్‌ ‌ఫ్లూ చరిత్ర మాయమైంది.

Leave a Reply