Take a fresh look at your lifestyle.

కృష్ణపట్నంలో సందడే సందడి

  • కరోనా ఆయుర్వేద మందుతో జనాల రాక
  • స్థానిక ఎమ్మెల్యే కాకాణి ఆధ్వర్యంలో పంపిణీ

నెల్లూరు, : నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పేరు ఇప్పుడు కరోనా రోగుల తాకిడితో సందడిగా మారింది. ఇక్కడి ఆయుర్వేద మందు తీసుకుంటే కరోనా ఇట్టే మాయం అవుతుందన్న ప్రచారంతో ప్రజలు వేలాదిగా తరలివస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాకాణి దగ్గరుండి మందును పంపిణీ చేయిస్తున్నారు.  ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు అక్కడ ఉచితంగా మందుపంపిణీ చేస్తున్న వార్త ఇప్పుడు దావానంలా వ్యాపించింది.  ఆనంద్‌ ఆయుర్వేదంపై ఉన్న పట్టుతో అతను మందును కనిపెట్టారు. కరోనాకు మందు ఇస్తున్నారన్న విషయంతో జనం తండోపతండాలుగా అక్కడికి వస్తున్నారు.

ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలిపివేశారు. అయితే మందుపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. దీంతో శుక్రవారం నుంచి మళ్లీ మందు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ ‌రెడ్డి ప్రారంభించారు. ఈ మందు కోసం ఇతర జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు తరలి వచ్చారు.కరోనా సెకండ్‌వేవ్‌ ‌కుదిపేస్తున్న వేళ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ! ఈ మందుపై చాలా మందిలో ఏదో తెలియని ఆశ. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో చికిత్స కూడా దుర్లభంగా మారింది. ఆక్సిజన్‌ అం‌దక అనేకమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలో ఇస్తున్న ’కృష్ణపట్నం ఆయుర్వేద మందు’ కరోనాకు బాగా పనిచేస్తోందనే ప్రచారం జరిగింది. దీంతో వేల సంఖ్యలో జనం ఇక్కడకు తరలివస్తున్నారు. అయితే శాస్త్రీయంగా రుజువు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీని నిలుపుదల చేసింది. పరీక్షల నిమిత్తం ఆయుష్‌ ‌ల్యాబ్‌కు పంపింది. దీనిపై సోషల్‌ ‌డియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి కృష్ణపట్నం కరోనా మందుని పంపిణీ చేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రకటించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది.  కాగా ఆనంద్‌ ఆయుర్వేద మందు పంపిణీ వద్ద గందరగోళం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ ‌చేశారు. ఒక్కసారిగా వేల మంది రావడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కాకాణి గోవర్దన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కొద్ది మందికి మాత్రమే మందు పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వ నివేదిక అనంతరం తేదీలని ప్రకటిస్తామని, అప్పటి వరకు పంపిణీని నిలిపేస్తామని చెప్పారు. ముత్తుకూరు మండలం, కృష్ణ పట్నంకు చెందిన ఆనంద్‌ ‌డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆయనకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికతపై మక్కువ ఎక్కువ. భగవాన్‌ శ్రీ ‌వెంకటయ్య స్వామి శిష్యుడు, గురవయ్య స్వామి దగ్గర శిష్యరికం కూడా చేశారు. ఆ సమయంలో ఆయుర్వేద మందులపై పట్టు సాధించారు.

ఆయుర్వేదంలో తనకున్న అనుభవంతోపాటు పలువురు మేధావుల దగ్గర సలహాలు కూడా తీసుకున్నారు. కరోనాను కట్టడి చేసే మందును తయారు చేసి ముందుగా కృష్ణపట్నం గ్రామ ప్రజలకు అందించారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో చికిత్స కూడా దుర్లభంగా మారింది. ఆక్సిజన్‌ అం‌దక అనేకమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలో ఇస్తున్న ’కృష్ణపట్నం ఆయుర్వేద మందు’ కరోనాకు బాగా పనిచేస్తోందనే ప్రచారం జరిగింది. దీంతో వేల సంఖ్యలో జనం ఇక్కడకు తరలివస్తున్నారు. అయితే శాస్త్రీయంగా రుజువు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీని నిలుపుదల చేసింది. పరీక్షల నిమిత్తం ఆయుష్‌ ‌ల్యాబ్‌కు పంపింది. దీనిపై సోషల్‌ ‌డియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ మందు పాజిటివ్‌ ఉన్న వారు, లేనివారు వాడవచ్చు. దీన్ని వాడితే ఊపిరితిత్తులు శుభ్రమై శక్తిపుంజుకుంటాయి.

తెల్లజిల్లేడు, మారేడు ఇగురు, నేరేడు ఇగురు, వేప ఇగురు, దేవర్‌దంగి (ఆడ, మగ) ఐదు వంతులు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, తోక మిరియాలు, పచ్చకర్పూరం, ఫిరంగి చెక్క, అన్నింటినీ కలిపి పొడిచేసి తేనెలో నాలుగు గంటలపాటు ఉడికించాలి. పాజిటివ్‌ ‌రోగులకు దీన్ని రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు ఇవ్వాలి.

Leave a Reply