Take a fresh look at your lifestyle.

బంగారు ఆభరణాల దొంగలు అరెస్ట్

38 ‌తులాల బంగారం రూ.6 లక్షల నగదు స్వాధీనం : ఎస్పీ

మహబూబ్‌నగర్‌, ‌జూన్‌ 26 (‌ప్రజాతంత్ర ప్రతినిధి) : సి ఎం ఆర్‌ ‌షాపింగ్‌ ‌మాల్‌ ‌లో ఇటీవల జరిగినటువంటి బంగారు ఆభరణాల చోరీ కి సంబంధించిన దొంగలను శుక్రవారం అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.6లక్షల నగదు, 38 తులాల బంగారం స్వాధీనపరుచుకున్న టు ఎస్పీ రామ రాజేశ్వరీ విలేకరుల సమావేశంలో తెలిపారు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి మహబూగర్‌ ‌జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అతి పెద్ద షాపింగ్‌ ‌మాల్‌ ‌సీఎంఆర్‌ ‌వస్త్ర దుకాణంలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని వన్‌ ‌టౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ ‌రాజేష్‌ ‌గౌడ్‌ ‌విచారణ చేపట్టగా షాప్‌ ‌కు సంబంధించిన సిబ్బంది దొంగతనానికి పాల్పడ్డారని విచారణలో తేలింది ఎస్పీ తెలిపారు ఈ నెల 19న షాపింగ్‌ ‌మాల్‌ ‌కి సంబంధించిన సిబ్బంది గంగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి అతి తక్కువ సమయంలో ఆభరణాల దొంగ తనానికి పాల్పడిన వారిని అదుపులోకి  తీసుకున్నారు.
సి ఎం ఆర్‌ ‌షాపింగ్‌ ‌మాల్‌ ‌కు సంబంధించిన ఉద్యోగ సిబ్బంది బంగారు ఆభరణాల దొంగతనానికి పాల్పడ్డారని విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి షాపింగ్‌ ‌మాల్‌ ‌యజమానికి తెలియకుండా వారిని తప్పుదోవ పట్టిస్తూ బంగారు ఆభరణాలను కాజేశారని ఎస్పీ తెలిపారు. షాప్‌ ‌లో ఉన్నటువంటి వస్తువులను ప్రైవేట్‌ ‌ఫైనాన్స్ ఉన్నటువంటి ముత్తూట్‌ ‌ఫైనాన్స్ ‌ల వారి వద్ద ఈ నగలను తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకునేవారు అని విచారణలో తేలినట్లు తెలిపారు ఈ కేసుకు ఇందుకు సంబంధించిన న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్టు వారిని జుడిషియల్‌ ‌కస్టడీ కి పంపిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు అతి తక్కువ సమయంలోనే బంగారు ఆభరణాల దొంగతనం చేధించి నందుకు ఎందుకు సహకరించిన వన్‌ ‌టౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌సిఐ తోపాటు టీంకు రివార్డులు అందించారు.

Leave a Reply