Take a fresh look at your lifestyle.

ఇసుక సమస్యపై వినతిపత్రం ఇస్తామంటే అరెస్ట్ ‌చేస్తారా

భద్రాచలం పట్టణంలో ఇసుక సమస్య పరిష్కరించాలని, భద్రాచలం ఇసుక ర్యాంపు వెంటనే ప్రారంభించి భద్రాచలం పట్టణ ప్రజలకు అందించిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు తరలించాలని భద్రాచలం పట్టణ ప్రజలకు తక్కువ ధరకే ఇసుక అందించాలని కోరుతూ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌ ‌కి రిప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు బయలుదేరిన సిపియం నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌కు తరలించారు. భద్రాచలం పట్టణంలో గిరిజనులు గిరిజనేతర పేదలు గృహ నిర్మాణాలకు, ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుక కొరత ఏర్పడడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భవన నిర్మాణ కార్మికులు 10వేల మందికి ఉపాధి లేక రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈ సమస్యను ప్రభుత్వ ప్రతినిధి అయిన మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన సిపియం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని సిపియం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ. జె.

రమేష్‌ అన్నారు. నాయకుల అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు.ఇసుక సమస్య పై ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభల్లో భద్రాచలం పట్టణ ప్రజల అవసరాలకు ఇసుక సరఫరా చేసిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లాలని తీర్మానం చేసినప్పటికీ, ఈ విషయంపై ప్రభుత్వం, అధికారులు ఏమీ తేల్చకుండానే ఇసుకను తరలించేం దుకు ర్యాంప్‌ ‌వద్ద రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చోద్యం చూడటం ఏమిటని ప్రశ్నించారు. భద్రాచలంలో పోలీస్‌ ‌రాజ్యం నడుస్తోందని ప్రజాప్రతినిధులకు రిప్రజెంటేషన్‌ ఇచ్చే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని విమర్శిం చారు. భద్రాచలం పట్టణంలో తీవ్రంగా ఉన్న ఇసుక సమస్యను పరిష్కరించేందుకు మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌ ‌జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అరెస్టు అయిన వారిలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు యంబీ నర్సారెడ్డి, పట్టణ నాయకులు బి వెంకట రెడ్డి, వై. వెంకటరామారావు,బండారు శరత్‌ ‌బాబు ఉన్నారు.

Leave a Reply