Take a fresh look at your lifestyle.

ఇద్దరు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్

మావోయిస్టు  పార్టీకి చెందిన ఇద్దరు కొరియర్లను అరెస్టు చేసినట్లు భద్రాచలం ఏఎస్పీ రా•ష్‌ ‌చంద్ర తెలిపారు. తన కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. దుమ్ముగూడెం మండలంలోని బైరాగులపాడు గ్రామానికి శివారుల్లో దుమ్ముగూడెం రితీష్‌ ఎస్సై సివిల్‌ ‌సిఆర్‌పిఎఫ్‌ ‌జవాన్లు బుధవారం ఉదయం 9గంటల సమయంలో వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానితంగా తిరుగుతూ కనిపించారు. పోలీసులకు గమనించి వారు పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. వారివద్ద నుండి మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాల్‌ ‌పోస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన శ్యామల రవి బిపిఎల్‌ ‌కర్మాగారంలో సెంట్రింగ్‌ ‌వర్కర్‌గా పనిచేస్తున్నాడని , అలాగే దుమ్ముగూడెం మండలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన కణితి వెంకటేశ్వర్లు వ్యవసాయం పనులు చేస్తూ కొంతకాలంగా మావోయిస్టు పార్టీ కొరియర్‌లుగా పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు.

 

మావోలు అందచేసే వాల్‌ ‌పోస్టర్లు గిరిజన గ్రామాల్లో పంపిణీ చేసేందుకు వారు వెళ్తునట్లు విచారణలో తేలిందని వారివద్ద ఉన్న వాల్‌ ‌పోస్టర్లు శబరీ ఏరియా కమిటి , ఆదివాసీ విప్లవ రైతు కూలీ సంఘం ఆదీవాసీ విప్లవ మహిళా సంఘం పేర్లు ఉన్నాయన్నారు. ఆ పోస్టర్లలో ప్రభుత్వం తునికాకు 50 ఆకులు కట్టకు 3 రూపాయలు చెల్లించాలని డిమాండ్‌ ‌చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రత్తి , మిర్చి కూలికి రోజుకు 250 , వరి మొక్కజొన్న కూలికి రోజుకు 350 చెల్లించాలని అందులో డిమాండ్‌ ‌చేసారని, యజమానులు కూలీలను మోసం చేయకండని హెచ్చరికలు జారీ చేసార•ని , గ్రామ గ్రామాన సార మద్యం బంద్‌కై పోరడాలని పేర్కొన్నారని ఏఎస్పీ తెలిపారు. ఆ ఇద్దరు కొరియర్లను అరెస్టు చేసి కోర్డుకు రిమాండుకు పంపుతున్నామని  అనంతరం వారిని కస్టడీలో తీసుకుని పూర్తి సమాచారం రాబడతామని ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో దుమ్ముగూడెం సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రితీష్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy