Take a fresh look at your lifestyle.

అం‌తర్‌ ‌రాష్ట్ర దొంగ అరెస్ట్

అంతర్రాష్ట్ర కరుడుగట్టిన దొంగ సయ్యద్‌ అల్తాఫ్‌ను గురువారం వరంగల్‌ ‌సిసిఎస్‌, ‌కాజీపేట పోలీసులు సంయుక్తంగా వలపన్ని పట్టుకున్నారని వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ (‌సిపి) డాక్టర్‌ ‌రవీందర్‌ ‌తెలిపారు. గురువారం పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2018 నుండి ఇప్పటి వరకు 28 నేరాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసి రూ.30 లక్షల విలువ గల వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడేవాడు అని ఆయన అన్నారు. నిందితుడు 28 చోరీలను చేయగా ఇందులో వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో మొత్తం 20 చోరీలకు పాల్పడ్డాడని ఇందులో కాజీపేట పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో 5, సుబేదారి పరిధిలో 5 కాకతీయ యూనివర్సిటీ పరిధిలో, మిల్స్ ‌కాలనీ పరిధిలో, పరకాల పరిధిలో రెండు చొప్పున మొత్తం ఆరు చోరీలకు పాల్పడగా శాయంపేట, దామెర, మడికొండ, మామునూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం నాలుగు చోరీలకు నిందితుడు పాల్పడినట్లు ఆయన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 ఖమ్మం జిల్లాలో ఒక దొంగ తనం చేశాడని ఆయన తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు మొత్తం సొత్తు విలువ రూ.30 లక్షలు ఇందులో 475 గ్రాముల బంగారం, మూడు కిలోల వెండి ఆభరణాలు, 2 లక్షల 50 వేల నగదు, 5 ఎల్‌ఇడి టీవీలు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఒక ప్రింటర్‌ 2 ‌సెల్‌ ‌ఫోన్లు 6 కెమెరాలు ఒక డిజిటల్‌ ‌వాచ్‌, ‌ఖరీదైన అద్దాలు, ఒక గ్యాస్‌ ‌సిలిండర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సిపి వివరించారు.

నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల మండలం, ప్రకాశం జిల్లాకు చెందిన వాడని సయ్యద్‌ అల్తాఫ్‌ (అలియాస్‌) అ‌ప్రోచ్‌, ‌వయస్సు 35 సంవత్సరాలు నివాస గ్రామం నవ పేట చెందినవాడని ఆయన తెలిపారు. నిందితుడు చిన్నప్పటి నుండి చిల్లర దొంగతనాలకు పాల్పడే వాడని తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుండి పారిపోయి విజయవాడలో కారు డ్రైవింగ్‌ ‌నేర్చుకొని కొద్ది రోజులు కార్‌ ‌డ్రైవర్‌గా పని చేశాడన్నారు. ఇదే సమయంలో ఇదే సమయంలో చెడు అలవాట్లు, వేసనాలకు అలవాటు పడడంతో జల్సా కోసం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేరాలకు ఒడిగట్టాడని ఆయన తెలిపారు. నిందితుడు 2000ల సంవత్సరం నుండి 2013 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని ఈస్ట్ ‌గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో అనేక చోరీలకు పాల్పడ్డాడని పలుమార్లు ఆంధ్రప్రదేశ్‌ ‌పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారన్నారు. నాలుగు సంవత్సరాలు జైలు జీవితం గడిపి 2017 డిసెంబర్‌లో రాజమండ్రి జైలు నుండి విడుదల అయ్యాడన్నారు. ముందుగా నిందితుడు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో కార్పెంటర్‌ ‌గా పని చేస్తూనే మహబూబాద్‌కు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, కొద్ది రోజులు ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఉన్న నిందితుడు 2018 నుండి తిరిగి నేరాలకు చేశాడని సిపి రవీందర్‌ ‌పేర్కొన్నారు. చోరీ చేసిన డబ్బుతో కార్లను, ఇతర వస్తువులు కొనుగోలు చేసి జల్సాలు చేసేవారన్నారు. వరంగల్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో అనేక నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది పోలీసులు వలపన్ని నిందితుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. కమిషనరేట్‌ ఓఎస్డీ తిరుపతి నేతృత్వంలో సిసిఎస్‌ ఇన్సెస్పెక్టర్‌ ‌రమేష్‌ ‌కుమార్‌, ‌కాజీపేట ఇన్సెస్పెక్టర్‌ ‌నరేందర్‌, ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. అంతర్‌రాష్ట్ర దొంగ అరెస్టు కోసం ప్రతిభ కనబర్చిన ఓఎస్డీ తిరుపతి, క్రైమ్‌ ‌బాబురావు, కాజీపేట ఏసిపి రవీందర్‌, ‌సిసిఎస్‌ అనలిటికల్‌ ఆఫీసర్‌ ‌సల్మాన్‌ ‌పాష, వివి రావు, ఎఎస్‌ఐ ‌శ్రీనివాసరాజు, శివ కుమార్‌, ‌హెడ్‌ ‌కానిస్టేబుల్‌ ‌రవీందర్‌, ‌జంపయ్య, కానిస్టేబుల్‌ ‌మహమ్మద్‌ అలీ, వేణుగోపాల్‌ ‌వంశీ, నజార్‌ ఉద్దీన్‌, ‌నర్సింగ్‌ ‌రావులను కమిషనర్‌ అభినందించారు.

Leave a Reply