Take a fresh look at your lifestyle.

పేకాట రాయుళ్ల అరెస్ట్

పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి నుండి రూ.44వేలు స్వాధీనం చేసుకున్నట్లు నర్మెట సీఐ రాపల్లి సంతోష్‌కుమార్‌ ‌తెలిపారు. సీఐ కథనం ప్రకారం బుధవారం రాత్రి 10గంటల ప్రాంతంలో నర్మెట మండలంలోని హన్మంతాపూర్‌ ‌గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ ‌జక్కుల పరమేశ్వర్‌తోపాటు పోలీస్‌ ‌సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని ఆటలో పెట్టిన నగదు రూ.44వేలను స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు.

అరెస్టు అయినవారిలో రఘునాథపల్లి మండలం మేకలగట్టుకు చెందిన ముక్క పరుశరాములు, పగిడిపల్లి చంద్రశేఖర్‌, ఇల్లందుల బాబు, ముక్క ఎల్లస్వామి, గడ్డమీది కిరణ్‌, ‌జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్‌కు చెందిన పగిడిపల్లి సత్యనారాయణ, హన్మంతాపూర్‌కు చెందిన పన్నీరు గురువయ్యలున్నారు. ఇప్పటికి మూడు పేకాట స్థావరాలపై ఎస్‌ఐ ‌పరమేశ్వర్‌ ‌దాడులు నిర్వహించినట్లు సమాచారం.

Leave a Reply