Take a fresh look at your lifestyle.

దొంగతనం కేసులో వ్యక్తి అరెస్ట్

‌నల్గొండ జిల్లా కు చెందిన చెన్న వంశీధర్‌ ‌రెడ్డి అలియాస్‌ ‌వంశీ అనే వ్యక్తి అంబసత్రం వీధిలో అద్దెకు ఉంటూ గత మూడు నెలల క్రితం తాతగుడి సెంటర్‌ ‌నందు మరొక ఇంట్లో చేరి దిలీప్‌ అనే వ్యక్తి ఇంట్లో బంగారు నగలు దొగిలించాడని ఇతన్ని శుక్రవారం నాడు సాయిబాబా గుడి సెంటర్‌ ‌వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో బంగారు నగలతో పట్టుకోవడం జరిగిందని అన్నారు. సిఐ వినోద్‌ ‌రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ నగలను కొత్తగూడెం నందు అమ్మేందుకు తీసుకువెళుతున్న సమయంలో పోలీసులు పట్టుకుని బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిఐ తెలిపారు.

బంగారు నగలవిలువ సుమారు 3 లక్షలు ఉంటుందని తెలిపారు. భద్రాచలం పట్టణ ప్రజలు కొత్త వ్యక్తులకు ఇల్లు అద్దెకిచ్చే సమయంలో వారి గుర్తింపు కార్డు తీసుకుని ఇల్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్సై మహేష్‌ ‌మరియు పోలీస్‌ ‌సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply