Take a fresh look at your lifestyle.

బెల్లంపల్లిలో సైబర్‌ ‌నేరగాళ్ళు అరెస్ట్

Arrest of cyber attackers in Bellampalli

బెల్లంపల్లి వన్‌టౌన్‌ ‌పోలీస్‌స్టేషన్‌లో బెల్లంపల్లి ఎసిపిరహమాన్‌ ‌సైబర్‌ ‌నేరగాళ్ళను అరెస్ట్ ‌చేసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలకత్తాలోని ఉదయ్‌ అనే సైబర్‌ ‌నేరస్తునితో కోమురంభీం దిల్లా దహెగాం పెంచికల్‌పేట గ్రామాలు చెందిన యువకులు గవాస్కర్‌,‌దిలీప్‌,‌నరేందర్‌,‌తిరుపతి,శ్రీనివాస్‌లు పరిచయం ఏర్పర్చుకొని ఉదయ్‌ ‌సూచల మేరకు కలకత్తలో ఉండి క్లబ్‌ ‌ఫ్యాక్టరీలో ఆన్‌లైన్‌ ‌పోర్టల్‌లో షాపింగ్‌ ‌చేసిన వ్యక్తుల ఫోన్‌ ‌నంబర్లను సేకరించి వారికి ఫోన్లు చేసి మీరు కొన్న వస్తువులకు స్కాచ్‌కార్డును స్కాచ్‌ ‌చేయగా మీకు మహేంద్రకారు బహుమతిగా వచ్చిందని సైబర్‌ ‌నేరగాడు ఫోన్‌ ‌చేయడంతో బెల్లంపల్లికి చెందిన జుమ్మిడి రాహుల్‌ అనే వ్యక్తి సైబర్‌ ‌నేరగాడు గవాస్కర్‌ ఏకాంట్‌లో 7500 డిపాజిత్‌ ‌చేశారు.

కారు రాకపోవడంతో మోసపోయానని తెలుసుకొని పట్టణంలోని వన్‌టౌన్‌లో సైబర్‌ ‌నేరగాళ్ళ పై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేసి కూపి లాగడంతో అయిదుగురు సైబర్‌ ‌నేరగాళ్ళలో ఇద్దరు తిరుపతి,శ్రీనివాస్‌ ‌పరారీలో ఉండగా రాంటెంకి గవాస్కర్‌,‌దుర్గం దిలీప్‌,‌జరుపుల నేరందర్‌ అనేముగ్గురు నేరగాళ్ళను గురువారం అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ విలేకరుల సమావేశంలో ఎసిపి రహమాన్‌,ఎస్‌హెచ్‌ఓ ‌రాజు,ఎస్సై రాజేంద్రప్రసాద్‌, ‌పోలీస్‌ ‌సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply