జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్డులోని మూడు మెడికల్ షాపులు, ఓ మెన్స్‌వేర్‌లో చోరికి పాల్పడిని ఇద్దరు నిందితులను పట్టుకొన్నట్లు అడిషనల్ ఎస్పి దక్షిణామూర్తి తెలిపారు. శుక్రవారం సాయంత్రం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ జూన్ 29న రాత్రి బైపాస్‌రోడ్డులోని నాలుగు షాపుల్లో ఇద్దరు దొంగలు చోరికి పాల్పడ్డారన్నారు. అక్కడి సిసి కేమరాల ఆధారంగా నిందితుల అచూకి కనుగొని పట్టుకోవడం జరిగిందన్నారు.
సర్ధార్ ఠాకూర్‌సింగ్, సర్ధార్ పోలార్సింగ్లు ఈ చోరిలకు ప్పాడ్డారని వీరి వద్ద నుంచి ఓ ద్విచక్ర వాహనంతోపాటు 3 వేల 2 వందల నగదును స్వాదీనం చేసుకొన్నామని అడిషనల్ ఎస్పి తెలిపారు. ఈసమావేశంలో డియస్పి వెంకటరమణ, టౌన్ సిఐ జయేశ్‌రెడ్డి, సిసిఎస్ సిఐ అరిఫ్ అలీఖాన్‌తోపాటు కానిస్టేబుల్లు శ్రీనివాస్‌తోపాటు పలువురు ఉన్నారు.