వనపర్తి,మే,29(ప్రజాతంత్ర విలేకరి) : మిగిలిపోయిన పదవతరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష జిల్లా అధికారులను ఆదేశించారు. పరీక్షలు నిర్వహణ పై కలెక్టర్ ఈ కిఞది సూచనలు చేయడం జరిగింది. పరీక్ష కేంద్రాల ముఖ్య నిర్వహకులు డిపార్టమెంటు అధికారులు ప్రతి గదిలో 12 మంది చొప్పున కొవిడ్ నిబంధనలను అనుసరించి భౌతిక దూరం పాటిస్తు షీటింగ్ ప్లాన్ చేసుకోవాలని జిల్లాలో గతంలో ఉన్న 35 పరీక్ష కేంద్రాలకు గాను అదనంగా 35 పరీక్ష కేంద్రాలను మొత్తం 70 కేంద్రాల ద్వారా నిర్వహించుటకు ఏర్పాటు చేయడం జరిగింది. అదనపు కేంద్రానికి అదనపు అధికారులను నియమించడంతో పాటు జిల్లాలో 813 మంది ఇన్విజులేటర్లను నియమించడం జరిగింది. పరీక్ష కేంద్రాల వద్ద క్రమ పద్దతిలో అనుమతించాలని పరీక్ష కేంద్రాలను మున్సిపాలిటిలో మున్సిపల్ కమీషనర్లు మిగతా కేంద్రాల్లో జిల్లా పంచాయితి అధికారి శానిటేజర్ కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు.
పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను అనుమతించేటప్పుడు ప్రతి విద్యార్థికి ధర్మల్ స్క్రీనింగ్ చేసి ప్రతి విద్యార్థికి రెండు మాస్కుల చొప్పున అందజేసి ప్రతి రోజు టెంపరేచర్ నమోదు చేయాలని దీనికి డిఎమ్అండ్హెచ్ఓ బాధ్యత వహించాలని ప్రతి కేంద్రంలో ఎఎన్ఎమ్ తప్పనిసరిగా ఉండాలని పరీక్ష కేంద్రాల్లో నిరాఘటంగా విద్యుత్ సౌకర్యం కొనసాగించాలని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఫర్నిచర్‌ను అన్ని వసతులను పాటించేలా చూడాలని అధికారులకు సూచించారు. విద్యార్తులకు ప్రతిరోజు నిమ్మకాయ రసం అందించి రోగనిరోధక శిక్తి పెరిగే విధంగా చూడాలని వసతి గృహాల్లో పాత స్టాక్‌ను వాడరాదని తెలిపారు. పోలీస్‌శాఖ పరీక్ష కేంద్రాల్లో బందోబస్తు నిర్వహించాలని అవసరమయితే ఎన్‌సిపి విద్యార్తు ల సేవలు ఉపయోగించుకోవాలని ఆర్టీసి అధికారులు పరీక్ష కేంద్రాలకు రద్దీ లేకుండా విద్యర్తులను ఒక గంట ముందుగానే చేరేవిధంగా బస్సులు నడపాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఎఎస్పీ షాకీర్‌హుసేన్, డిఈఓ సుశీందర్‌రావు, ఆర్డీఓ చంద్రారెడ్డి పాల్గొన్నారు.