Take a fresh look at your lifestyle.

యాదాద్రిలో దర్శనాలకు ఏర్పాట్లు

  • లాక్‌డౌన్‌ ‌నిబంధనల మేరకే భక్తులకు అనుమతి: ఇవో

‌యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.  లాక్‌డౌన్‌ ‌నిబంధనల మేరకే భక్తులను అనుమతివ్వనున్నట్టు తెలిపారు. ఇప్పటికే భౌతిక దూరం పాటించేలా గడులను ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు శ్యానిటైజర్లతో శుభ్రం చేసుకున్నాకే లోపలకు అనుమతిస్తామన్నారు. సాధారణ రోజుల్లో జరిగే అన్ని సేవలను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నామన్నారు. వ్రతాల నిర్వహణ, తలనీలాల సమర్పణ విషయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు. దర్శనాల విషయంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ముందుగా ట్రయల్‌ ‌రన్‌ ‌నిర్వహిస్తామని గీతారెడ్డి తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు దర్శనాలకు రాకపోవడమే మంచిదన్నారు.  ప్రసాద కౌంటర్ల వద్ద పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్టు గీతారెడ్డి తెలిపారు. నియమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి ఉంటుందన్నారు.

Leave a Reply