క్షేత్రస్థాయిలో పూర్తయిన శిక్షణ- జాబితా సిద్ధం
కొరోనా మహమ్మారిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం వ్యాక్సినేషన్‌కు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.కొత్త ఏడాదిలో కొరోనా టీకా ఇవ్వడం ప్రారంభించనున్నారు. టీకాకు అనుమతిపై కేంద్రం ఓ ప్రకటన చేయనుంది. ఈలోగా పంపిణీకి సంబంధించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి. వైరస్ నియంత్రణకు వ్యాక్సినేషన్ పక్రియ జనవరి రెండో వారం నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. కేంద్రం ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే మొదటి విడతలో వ్యాక్సినేషన్ చేయాల్సిన వారి జాబితాలను తయారు చేసి కోవిన్ సాప్ట్‌వేర్‌లో నమోదు చేశారు. అలాగే ట్రయల్ రన్ కూడా పూర్తి చేవారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానుసారం మొదటి విడతలో కొవిడ్‌పై పోరాటంలో ముందు వరుసలో ఉన్న వైద్యులు, వైద్య సహాయకులు, నర్సింగ్ స్టాఫ్, ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు, ఇతర సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయనున్నారు.
ఇందులో ప్రభుత్వ వైద్య సిబ్బందితో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న వారికీ వ్యాక్సినేషన్ మొదటి విడతలోనే చేయనున్నారు. వ్యాక్సినేషన్ కోసం శిక్షణ ఇచ్చి నట్లు కూడా వెల్లడించారు. వ్యాక్సినేషన్ పక్రియను పకడ్బందీగా నిర్వహించడం కోసం ఇప్పటికే మూడు రోజుల పాటు ప్రత్యేకంగా అవగాహనా, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక వ్యాక్సినేషన్ చేయించుకునే వారు ముందుగా నమోదు చేసుకోవల్సి ఉంటుంది. కోవిన్ సాప్ట్‌వేర్‌లో పేరు నమోదై టీకా వేయించుకునే సిబ్బంది, వారు పనిచేసే కేంద్రం, ఆస్పత్రికి సంబంధించి ధ్రువీకరణ కార్డులు చూపవలసి ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఆస్పత్రులలో కొవిడ్ వ్యాక్సిన్‌ను నిల్వ చేయడం కోసం కోల్డ్ చైన్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ను -2 డిగ్రీల సెల్సియస్ వద్ద భద్ర పరచాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో ఆయా కేంద్రాల్లో విద్యుత్, కోల్డ్ స్టోరేజ్/ప్రిజర్వ్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా ప్రతీ కేంద్రంలో 3 గదులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక గదిని వేయిటింగ్ రూంగా రెండో గదిని వ్యాక్సినేషన్ కోసం కేటాయించనున్నారు. వ్యాక్సి నేషన్ తరువాత తరువాత ఇతరత్ర దుష్ఫల్రితాన్ని పరిశీలించడం కోసం అరగంట పాటు వేచి ఉండేలా మరో గదని కేటాయించనున్నారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తిన పక్షంలో అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స కూడా అందించే ఏర్పాట్లు ఉండేలా చూస్తున్నారు.