Take a fresh look at your lifestyle.

ప్రశాంతంగా జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు

మెటీరియల్‌ ‌పంపిణీని పరిశీలించిన కలెక్టర్‌
‌నగరంలోని జిల్లా పరిషత్‌ ‌కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన మెటీరియల్‌ ‌డిస్టిబ్యూష్రన్‌ ‌కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ‌గంధం చంద్రుడు పరిశీలించారు. .రాష్ట్ర ఎన్నికల కవి•షన్‌ ఆదేశాల ప్రకారం జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నటలు కలెక్టర్‌ ‌వెల్లడించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో 8న పోలింగ్‌, 10‌న కౌంటింగ్‌కు, అవసరమైతే 9వ తేదీన రీపోలింగ్‌ ‌కు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 63 జడ్పీటీసీ స్థానాలకి ఎన్నికలు నిర్వహణ.. 841 ఎంపీటీసీ స్థానాల్లో 50 ఏకగ్రీవం కాగా, మిగిలిన 791 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరపనున్నాం.

జిల్లా పరిషత్‌ ‌కార్యాలయం నుంచి ఈరోజు జిల్లాలోని అన్ని మండలాలకు బ్యాలెట్‌ ‌పేపర్లు, ఇండెలిబుల్‌ ఇం‌క్‌ ‌తదితర ఎన్నికల మెటీరియల్‌ ‌ను పంపిణీ చేస్తున్నాం.. ఎన్నికలకు ఒక రోజు ముందు నుంచి మండల కేంద్రాల నుంచి పోలింగ్‌ ‌కేంద్రాలకు మెటీరియల్‌ ‌పంపిణీకి చర్యలు తీసుకున్నాం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మైక్రో అబ్జర్వర్‌ ‌ల నియామకం, వెబ్‌ ‌కాస్టింగ్‌, ‌వీడియోగ్రఫీ ద్వారా గట్టి నిఘాతో ఎన్నికలు జరపనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ ‌కలెక్టర్‌ (‌రెవెన్యూ) నిశాంత్‌ ‌కుమార్‌, ‌జిల్లా పరిషత్‌ ‌సి ఈ ఓ శోభా స్వరూపారాణీ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply