ప్రజాతంత్ర, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి సెట్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈసెట్, ఎంసెట్, పీజీసెట్, ఐసెట్, ఎడ్ సెట్, లాసెట్ అన్ని పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ -2021 మంగళవారం జరుగనుంది. దీంతో పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీఎస్ ఈసెట్ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించ నున్నారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.
సీబీటీ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టిటెక్పై ఇచ్చిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. లేదంటే.. విద్యార్థులను పరీక్ష హాల్ లోకి అనుమతించబోమని తేల్చి చెప్పారు. కరోనా నిబంధనల మేరకు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. అంతేకాదు.. రెండు గంటల ముందు నుండే విద్యార్థులను పరీక్ష కేంద్ర లోకి విద్యార్థుల అనుమతి ఉంటుందని.. ఒక్క నిమిషం నిబంధన కారణంగా ఉదయం9.. మధ్యాహ్నం 3 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించోమని కన్వీనర్ వెంకట రమణా రెడ్డి తెలిపారు.ఆగస్టు 3వ తేదీన ఈసెట్ పరీక్ష జరుగనుంది. ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎంసెట్ నిర్వహించనున్నారు. 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు.. 9,10 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షలు జరగనున్నాయి.