Take a fresh look at your lifestyle.

నేటి గణేశ్‌ ‌నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

  • బాలాపూర్‌ ‌నుంచి ట్యాంక్‌ ‌బండ్‌ ‌వరకు భద్రత మధ్య శోభాయాత్ర
  • మధ్యాహ్నం 3 కల్లా పూర్తయ్యేలా చర్యలు
  • హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆం‌క్షలు..జిల్లాల నుంచి వొచ్చే ఆర్టీసీ బస్సులు శివార్లకే పరిమితం
  • నిమజ్జనానికి భారీగా బందోబస్తు : సిపి సీపీ అంజనీకుమార్‌

హైదరాబాద్‌ ‌మహానగరంలో ఆదివారం జరిగే మహా నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశాలతో ఈ యేడు హుస్సేన్‌ ‌సాగర్‌లోనే నిమజ్జనాలు చేయటానికి అవకాశం దక్కింది. భారీ భద్రత, పటిష్ట బందోబస్తు, సిసి కెమెరాల నిఘా మధ్య నిమజ్జనం సాగనుంది. గత ఏడాది విగ్రహాల ఏర్పాటుకు అనుమతి దక్కకపోవడంతో ఈ యేడు రెట్టించిన ఉత్సాహంతో వినాయకచవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్‌ ‌గణేశుడిని కూడా భారీగానే ఏర్పాటు చేశారు. నగరంలోని విగ్రహాలు తరలే దారులను హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ అం‌జనీకుమార్‌  ఇప్పటికే పరిశీలించి తగు సూచనలు చేశారు. బాలాపూర్‌ ‌నుంచి ట్యాంక్‌బండ్‌ ‌వరకు ఉన్న రూట్‌ను పరిశీలించారు.

ప్రతి క్రేన్‌ ‌వద్ద ఒక పోలీస్‌ అధికారి, మండపాల నుంచి వచ్చే ఒక్కో విగ్రహంతో ఒక కానిస్టేబుల్‌ ఉం‌డేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.  సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీపీ చెప్పారు. డ్రోన్లు వాడటం లేదన్నారు. ఈ ఏడాది నిమజ్జనానికి వినియోగిస్తున్న నూతన సాంకేతికత వల్ల ప్రతీ విగ్రహానికి 4 నుంచి 6 నిమిషాల సమయం ఆదా అవుతుందన్నారు. ఆదివారం కావడంతో నిమజ్జనాలకు కొంత వెసులుబాటు కలుగనుంది. ఖైరతాబాద్‌ ‌పంచముఖ రుద్ర మహా గణపతి నిమజ్జన ఏర్పాట్లు రెండురోజుల ముందే ప్రారంభమయ్యాయి. ఎప్పటి మాదిరిగానే ఎస్‌టిసి ట్రాన్స్‌పోర్టుకు చెందిన భారీ వాహనం శుక్రవారం తెల్లవారుజామునే ప్రాంగణానికి చేరుకుంది. దానిపై ఇనుముతో కూడిన స్తంభాలతో వెల్డింగ్‌ ‌పనులు మొదలుపెట్టారు. గణపతి కోసం వేసిన షెడ్డుపై ఉన్న రేకులను తొలగిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి షెడ్డు తొలగింపు పనులు చేపట్టినట్లు పోలీసులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఖైరతాబాద్‌ ‌భారీ గణపతి దర్శనాలను శనివారం రాత్రి 9 గంటల వరకే అనుమతిస్తామని ఇన్‌చార్జి పోలీసు అధికారి రాజు నాయక్‌ ‌తెలిపారు.

ఆదివారం మధ్యాహ్నం 3 లోపు మహాగణపతి నిమజ్జనం అవుతుందని ఉత్సవ కమిటీ పేర్కొంటుంది. శనివారం రాత్రి నుంచి విగ్రహాలను ట్రాలీలపైకి చేర్చే పనులు ప్రారంభం అవుతాయని, ఆదివారం ఉదయం 8 నుంచి 9 గంటల లోపు శోభాయాత్ర ప్రారంభం అవుతుందని అధికారులు తెలుపుతున్నారు. మహాగణపతిని తరలించేందుకు 11 సంవత్సరాలుగా విజయవాడకు చెందిన ఎస్‌టిసి ట్రాన్స్‌పోర్టు అధినేత దండమూడి వెంకటరత్నం వారి భారీ ట్రాన్స్‌పోర్టు వాహనాన్ని పంపుతున్నారు. 26 టైర్లతో 100 టన్నుల బరువును తరలించే సామర్థ్యం ఉన్న ట్రాలీపై దాదాపు 30 నుంచి 32 టన్నుల బరువున్న గణపతిని సులువుగా తరలిస్తారు. గణేశ్‌ ‌నిమజ్జనం నేపథ్యంలో ఆదివారం 565 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ట్యాంక్‌బండ్‌ ‌పరిసర ప్రాంతాలకు గణేశ్‌ ‌నిమజ్జనం స్పెషల్‌ అనే బోర్డులతో ఈ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.

వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ఈనెల 19 అర్ధరాత్రి నుంచి 20వ తేదీ తెల్లవారుజాము వరకు 8 ఎంఎంటీఎస్‌ ‌ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. నిమజ్జనం నిమిత్తం వివిధ ప్రాంతాలు, జోన్లకు ఉన్నతాధికారులు ప్రాతినిధ్యం  వహిస్తున్నారు. వారిలో అదనపు సీపీలు షికాగోయెల్‌, ‌డీఎస్‌ ‌చౌహాన్‌, ఐజీపీ విజయ్‌కుమార్‌, ‌జాయింట్‌ ‌సీపీలు ఏఆర్‌ శ్రీ‌నివాస్‌, ‌పి.విశ్వప్రసాద్‌, ఎం.‌రమేశ్‌, ‌డీసీపీలు కలమేశ్వర్‌, ‌గజరావు భూపాల్‌, ‌రాధాకిషన్‌రావు, ఎల్‌ఎస్‌ ‌చౌహాన్‌, అదనపు డీసీపీ ముత్యంరెడ్డి ఉన్నారు.

నగరంలో పోలీస్‌ ‌కమిషనర్‌తో పాటు అదనపు సీపీలు, జాయింట్‌ ‌సీపీలు, డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్‌ ‌కానిస్టేబుళ్లు, పోలీస్‌ ‌కానిస్టేబుళ్లు, ఎస్‌పిఓలు, హోంగార్డులతో పాటు జిల్లా పోలీసులు, కేంద్రబలగాలు, ఇతర విభాగాల నుంచి ఐజీ, డీఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలు, సిఐలు ఇతర సిబ్బంది మొత్తం 19 వేలకు పైగా సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు సీపీ తెలిపారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌ ‌బృందాలు అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉంటాయి. విధి నిర్వహణకు ఇతర జిల్లాల నుంచి వస్తున్న సిబ్బందికి ఆహార, వసతి ఏర్పాట్లపై కూడా పోలీసు అడ్మిన్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌తో పాటు రాజన్నబౌలి, వి•రాలం ట్యాంక్‌, ఎ‌ర్రకుంట, షేక్‌పేట్‌ ‌నాలా, సరూర్‌నగర్‌ ‌చెరువు, సఫిల్‌గూడ/మల్కాజిగిరి ట్యాంక్‌, ‌హష్మత్‌పేట్‌ ‌లేక్‌లలో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆం‌క్షలు..జిల్లాల నుంచి వొచ్చే ఆర్టీసీ బస్సులు శివార్లకే పరిమితం
హైదరాబాద్‌ ‌నగరంలో ఆదివారం జరిగే గణేశ్‌ ‌నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్‌ ‌పోలీసులు తెలిపారు. ట్రాఫిక్‌ ఆం‌క్షల గురించి తెలుసుకునేందుకు కంట్రోల్‌ ‌రూమ్‌ను ఏర్పాటుచేశారు. గణేశుని విగ్రహాలను తరలించే వాహనాలకు ప్రత్యేకంగా కలర్‌ ‌కోడింగ్‌ ఏర్పాటు చేశారు. దీని ఆధారంగా ట్రాఫిక్‌ ‌పోలీసులు రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. ట్రాఫిక్‌ ‌రద్దీని గూగుల్‌ ‌మ్యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ ‌చేయనున్నారు. నిమజ్జనం నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. అదే విధంగా జిల్లాల నుంచి వొచ్చే ఆర్టీసి బస్సులు నగర శివార్లకే పరిమితం కానున్నాయి. నల్లగొండ వైపు నుంచి వొచ్చే వాహనాలను ఎల్బీనగర్‌, ‌వరంగల్‌ ‌వైపు నుంచి వొచ్చే వాహనాలు ఉప్పల్‌, ‌దేవరకొండ నుంచి వొచ్చే వాహనాలు సాగర్‌ ‌రింగ్‌రోడ్డు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌నుంచి వొచ్చే వాహనాలను ఆరాంఘర్‌ ‌వద్ద నిలిపివేయనున్నారు. ఇక అంతర్‌ ‌రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై శనివారం అర్థరాత్రి నుంచే నిషేధం విధించనున్నారు.   విగ్రహాల నిమజ్జనానికి ఆర్టీఏ ఆధ్వర్యంలో వెయ్యి వాహనాలను అందుబాటులో ఉంచామని, అవసరమైనవారు వినియోగించు కోవాలన్నారు. వాహనాల పర్యవేక్షణకు 10 మంది ఆర్టీఏ అధికారులు, 50 మంది మోటార్‌ ఇన్‌స్పెక్టర్‌ ‌స్థాయి అధికారులను నియమించినట్లు చెప్పారు. ఎవరికైనా సందేహాలుంటే 040-27852482, 9490598985, 9010303626 నంబర్లలో సంప్రథించవచ్చని అధికారులు తెలిపారు.

నిమజ్జనానికి భారీగా బందోబస్తు : సిపి సీపీ అంజనీకుమార్‌
‌గణేష్‌ ‌నిమజ్జనం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ అంజనీకుమార్‌ ‌తెలిపారు. 2020లో కొరోనా కారణంగా నిమజ్జనాలు జరగలేదన్నారు. ఈ ఏడాది మొదటి సారిగా పీవీ మార్గ్‌లో కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామన్నారు. 2.5 లక్షలు గణేష్‌ ‌విగ్రహాలను జీహెచ్‌ఎం‌సీ ద్వారా అందజేశారని పేర్కొన్నారు. దీంతో చాలా విగ్రహాలు ఇంట్లోనే నిమజ్జనం చేస్తున్నారని చెప్పారు. 27 వేల మంది పోలీసులు బలగాల ద్వారా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రాపిడ్‌ ‌యాక్షన్‌ ‌ఫోర్స్, ‌గ్రే హౌండ్స్, ఆక్టోపస్‌తో నిఘా కట్టుదిట్టం చేశామన్నారు. సమస్యాత్మక , అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. అనుభవం ఉన్న పోలీస్‌ అధికారులను నగరంలో ఇంచార్జ్‌లుగా నియమించామని పేర్కొన్నారు. జియో ట్యాగింగ్‌ ‌ద్వారా విగ్రహాల నిమజ్జనం మొత్తం పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు.

 

Leave a Reply