Take a fresh look at your lifestyle.

ప్రపంచ వ్యాప్తంగా కొరోనా విజృంభణ

  • ఇప్పటివరకూ 1,83,579 పాజిటివ్‌ ‌కేసులు నమోదు
  • 7,400 మందికి పైగా మరణించినట్లు ప్రకటన

‌వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ‌పలు దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 1,83,579 పాజిటివ్‌ ‌కేసులు నమోదవగా 7,400 మందికి పైగా మరణించారు. పాకిస్తాన్‌లో 212 కేసులు నమోదు కాగా బుధవారం తొలి మరణం నమోదైంది. వైరస్‌ ‌వేగంగా విస్తరిస్తున్న ఇరాన్‌లో కరోనా కేసుల సంఖ్య 988కి పెరగ్గా 135 మంది మరణించారు. స్సెయిన్‌లో తాజాగా 2000 కొత్త కేసులు నమోదవగా మొత్తం పాజిటివ్‌ ‌కేసుట సంఖ్య ఏకంగా 11,000కు ఎగబాకింది. మరోవైపు కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని పర్యవేక్షిస్తున్న డబ్ల్యుహెచ్‌ఓలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ ‌రిపోర్టస్ ‌వచ్చాయని అధికారులు ధ్రువీకరించారు. ఇక వైరస్‌కు కేంద్రమైన చైనాలో 80,881 కేసులు నమోదవగా మిగిలిన దేశాల్లో 94,000 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని నిరోధించే క్రమంలో ఫిజర్‌, ‌బయోఎన్‌టీ సంస్థలు సంయుక్తంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయనున్నాయి. డెడ్లీ వైరస్‌ ‌వ్యాప్తితో ముందుజాగ్రత్త చర్యగా యూరో 2020 సాకర్‌ ‌టోర్నమెంట్‌ను ఏడాది పాటు వాయిదా వేయగా, టీ-20 వరల్డ్‌కప్‌ ‌షెడ్యూల్‌ ‌ప్రకారమే జరుగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది.

పాకిస్తాన్‌లో తాజాగా మరికొన్ని కరోనా కేసులు నమోదు కావటంతో ఇప్పటి వరకూ ఈ ఇన్ఫెక్షన్‌ ‌బారిన పడిన వారి సంఖ్య 212కు చేరినట్లు అధికారులు చెప్పారు. ఇందులో అత్యధికంగా సింధ్‌ ‌ప్రావిన్స్‌లో 155 కేసులు, ఖైబర్‌ ‌ఫక్తూన్వాలో 15, బెలూచిస్తాన్‌లో 10, గిల్గిట్‌- ‌బాల్టిస్తాన్‌లో 5, ఇస్లామాబాద్‌లో 2 పంజాబ్‌లో 1 నమోదయినట్లు అధికారులు వివరించారు. కరోనా వైరస్‌ ‌వ్యాప్తి ప్రభావంతో అక్కడ విద్యాసంస్థలను మూసేశారు. గడచిన 24 గంటల వ్యవధిలో కరోనా ఇన్ఫెక్షన్‌కు సంబంధించి 21 మరణాలు, 1,210 తాజా కేసులు నమోదు కావటంతో ఫ్రాన్స్ ‌ప్రభుత్వం జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించింది. తాజా మరణాలతో ఫ్రాన్స్‌లో కరోనా మృతుల సంఖ్య 148కి చేరింది. ఈ నేపథ్యంలో ప్రజల కదలికలకుసంబంధించి జారీచేసిన తాజా ఆదేశాలు కనీసం రెండు వారాల పాటు అమలులో వుంటాయని అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఈ వైరస్‌ ‌వ్యాప్తిని అడ్డుకునేందుకు ఐరోపా దేశాల కూటమి సభ్యదేశాలు తమ సరిహద్దులను మంగళవారం నుండి నెలరోజుల పాటు మూసివేస్తున్నాయని, స్వదేశానికి తిరిగి వచ్చేందుకు మాత్రమే అనుమతులుంటాయని మాక్రాన్‌ ‌చెప్పారు.

- Advertisement -

ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ ‌సంక్షోభం వచ్చే ఆగస్టు వరకూ కొనసాగే అవకాశం వుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ అం‌చనా వేశారు. ఈ వైరస్‌ ‌మహమ్మారి ప్రభావాన్ని తప్పించుకునేందుకు అమెరికా ప్రజలు తమను తాము గృహనిర్బంధం చేసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ట్రంప్‌ ఈ ‌వ్యాఖ్యలు చేయటం గమనార్హం. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం నాటికి అమెరికా దేశవ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్‌ ‌కేసులు 4,500కు పైగా నమోదు కాగా, 85 మంది మృత్యువాత పడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ వైరస్‌ ‌నానాటికీ వేగంగా విస్తరిస్తుండటంతో దీనిని అడ్డుకునేందుకు ప్రభుత్వం పర్యాటక ఆంక్షలు, స్కూళ్లు, రెస్టారెంట్లు, బార్‌ల మూసివేత, వినోద కార్యక్రమాల రద్దు వంటి చర్యలు చేపట్టింది. మంగళవారం ఆయన వైట్‌హౌస్‌లో డియా ప్రతినిధులతో మాట్లాడుతూ ’ఈ మంచి పని కూడా చేయలేకపోతే మనం కరోనా వైరస్‌ ‌మరణాలను తక్కువ స్థాయికి తేలేం.. కానీ ప్రజలు మాత్రం జులై, ఆగస్టు గురించి మాట్లాడుతున్నారు. ఆ సమయానికి కరోనా బెడద తొలగిపోతుందని భావిస్తున్నాన’ని అన్నారు.

ఇతర దేశాల అనుభవాలను గమనిస్తే కరోనా కేసుల సంఖ్య రానున్న వారాల్లో గణనీయంగా పెరిగే అవకాశం వుందని ఆయన చెప్పారు. ఇదిలా వుండగా కరోనా వైరస్‌ ‌బెడద నుండి తప్పించు కునేందుకు వైట్‌హౌస్‌ అమెరికన్‌ ‌ప్రజలకు సోమవారం నాడు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలు ఒకరికొకరు దూరంగా వుండాలని, సామాజిక కార్యక్రమాలు నివారించు కోవాలని, పది మంది కన్నా ఎక్కువ ఒక చోట చేరవద్దని సూచించింది. ఈ సూచనలు ప్రతి ఒక్కరూ పాటిస్తే మనం ఈ వైరస్‌ను తప్పకుండా ఓడించగలమని ట్రంప్‌ ‌చెప్పారు. వైరస్‌ ‌బెడద తొలగిన తరువాత మనందరం కలిసి విజయోత్సవాలు జరుపుకోవచ్చన్నారు. శాన్‌‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలోని సిలికాన్‌ ‌వాలీ ప్రాంతాలలో వుంటున్న అరవై లక్షల మందికి పైగా ప్రజలను ఇళ్లలోనేవుండాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా హోటళ్లు, బార్‌లు, సినిమాహాళ్లు మూతపడ్డాయి. కరోనా వైరస్‌ ‌బెడదను అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలన్నింటికీ మద్దతుగా నిలిచేందుకు తాము సిద్ధంగా వున్నామని అమెరికా రక్షణశాఖ పెంటగాన్‌ ‌ప్రకటించింది.

Leave a Reply