5లక్షలు దాటిన కొరోనా బాధితులు సంఖ్య
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులు సంఖ్య 5లక్షలు దాటింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి 22, 334 మంది మృతిచెందారు. కరోనా నుంచి ఇప్పటి వరకు 1, 21, 214 మంది కోలుకున్నారు. అటు ఇటలీ, స్పెయిన్, అమెరికాలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదిలా ఉండగా అమెరికాలో కరోనా నివారణకు భారీ బ్జడెట్ కేటాయించింది. రూ. 1,500 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రతిపాదించిన బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. దీనికి ప్రజాప్రతినిధుల సభ ఆమోదం ఆమోదం తెలిపి..ట్రంప్ సంతకం చేస్తే అమల్లోకి వస్తుంది. కాగా ఈ నిధులను మొత్తం కూడా ఆస్పత్రుల నిర్మాణం, ఉపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సాయం చేసేందుకు వినియోగించనున్నారు. అటు భారత్ కూడా కరోనా నివారణకు రూ 1.70లక్షల కోట్లు కేటాయించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 5,00,000 దాటింది. కరోనా భారీన పడి 24,070 మంది మృతి చెందారు. మన దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 45కు చేరగా ఏపీలో 11 మందికి కరోనా సోకింది. కేంద్రం కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తోంది. కానీ కొన్ని ప్రాంతాలలో ఈ నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదు.
భారతసంతతి బాలికకు వైరస్:
వాటికన్లోని కైస్త్రవ మత పెద్ద పోప్ నివాస గృహ ఉద్యోగికి వైరస్ సోకింది. సింగపూర్‌లో భారత సంతతి బాలిక (3) వైర్‌సకు గురైంది. రాజప్రాసాదంలోని ఏడుగురు ఉద్యోగులు కొవిడ్ బారినపడటంతో మలేసియా రాజ దంపతులు స్వీయ క్వారంటైన్‌కు వెళ్లారు. ఇటలీలో గత నెల రోజుల్లో 67 మంది మత గురువులు చనిపోయారు. స్పెయిన్‌లో రోజు వ్యవధిలో మరో 665 మంది మృతి చెందారు. ఇటలీలో మృతుల సంఖ్య 8 వేలకు చేరింది. చైనాలో కొత్త కేసులే నమోదు కాలేదు. కరోనా సంక్షోభం విషయంలో డబ్ల్యూహెచ్‌వో పూర్తిగా చైనాను వెనకేసుకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ఈ విషయంలో సంస్థ తీరుపై చాలామందికి అసంతృప్తి ఉందన్నారు. కరోనాపై సమరంలో జి-20 దేశాల సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక అనిశ్చితి నివారణకు ప్రపంచ మార్కెట్లోకి 5 ట్రిలియన్ డాలర్లను జొప్పించనుంది. అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో నిర్లక్ష్యం చేశారు. బ్రిటన్‌లో కూడా అలసత్వం ప్రదర్శించారు. మన దేశంలో కూడా ఆలస్యమైందా అన్నది చెప్పలేం. జరిగిన ఆలస్యం గురించి మాంస చేయకుండా జరగబోయే దాన్ని గురించి ఆలోచించడం అవసరమని ఇపుణులు హెచ్చరిస్తున్నారు.ఆరోగ్య సంరక్షణ విషయంలో సింగపూర్, దక్షిణ కొరియాల్లో ప్రభుత్వం చాలా ముందంజలో ఉంది.