లక్షల కుటుంబాలకు చికిత్స : మంత్రి ఈటల
అయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ మెరుగైనదని మంత్రి ఈటల రాజేందర్ పురుద్ఘాటించారు. ఆరోగ్య శ్రీ ద్వారా 80 లక్షల కుటుంబాలకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అయుష్మాన్ భారత్‌లో 26 లక్షల కుటుంబాలకు మాత్రమే చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఆరోగ్యశ్రీకి 1200 కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రకటించారు. ఆరోగ్యశ్రీకి 300 కోట్లు సాయమందించాలని కోరామని, అయుష్మాన్ భారత్‌లో చేరాలని సూతప్రాయ అంగీకారం తెలిపామని చెప్పారు.
కేంద్రం ఇచ్చినా, రాష్ట్రం ఇచ్చినా అది ప్రజల సొమ్మే అని ఈటల వ్యాఖ్యానించారు. మెడికల్ సీట్ల కేటాయింపులో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం వార్తలపై.. పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేశాం. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం. పదేళ్ల పాటు ఉమ్మడి ఆంధప్రదేశ్ నిబంధనలు ఉన్నాయి. తెలంగాణ విద్యార్థుల కోసం మా ఆరాటం ఉంటుంది. కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఎప్పుడు వ్యాక్సిన్ అందించినా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వ్యాక్సినేషన్‌పై 10 వేల మంది వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చాం అని ఈటల రాజేందర్ తెలిపారు.