Take a fresh look at your lifestyle.

జమ్ము కశ్మీర్‌ ‌పూంచ్‌లో ఆర్మీ వాహనంలో మంటలు

నలుగురు జవాన్ల దుర్మరణం
శ్రీనగర్‌, ఏ‌ప్రిల్‌ 20 : ‌జమ్ముకశ్మీర్‌ ‌లోని పూంచ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. తోతావాలి గల్లీలో ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్రగాయలయ్యాయి. రోడ్డుపై ఆర్మీ వెహికిల్‌లో మంటలు చెలరేగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. జమ్ము-పూంచ్‌ ‌హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆర్మీ ఆదేశించింది సంఘటనా స్థలానికి ఫైర్‌ ‌బ్రిగేడ్‌ ‌చేరుకుని  మంటలను ఆర్పింది. భట్టా దురియన్‌ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సీనియర్‌ ఆర్మీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సక్షిస్తున్నారు.అయితే, వీరంతా 49 రాష్టీయ్ర రైఫిల్స్ 13 ‌సెక్టార్‌ ‌రోమియో ఫోర్స్ ‌కి చెందిన వారిగా గుర్తించారు. పిడుగుపాటు కారణంగా అత్యధిక ఓల్టేజ్‌ ‌విద్యుత్‌ ‌ప్రవహించడంతో మంటలు చెలరేగినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు ఆర్మీ అధికారులు. గాయపడిన జవాన్లను ఆస్పత్రికి తరలించారు.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, ఈ ఆర్మీ వాహనంలో ఆయుధాలతో పాటు, డీజిల్‌ ‌కూడా ఉంది, దీని కారణంగా మంటలు మరింత చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో వర్షం కురుస్తున్నప్పటికీ ట్రక్కు మంటలను అదుపు చేయలేకపోయింది. ఏదైనా విధ్వంసం జరిగిందా..? మరేదైనా కారణమా అని తెలియాల్సి ఉంది.  ఆర్మీ అధికారులు సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు. ప్రమాద స్థలం నుంచి ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. లేక ఉగ్రవాదుల చర్య ఏమైనా ఉందా అనే కోణంలో ఆర్మీ అధికారులు దర్యప్తు చేస్తున్నారు.

Leave a Reply