Take a fresh look at your lifestyle.

రిటైర్డ్ ఆర్మీజవాన్‌ ‌కాల్పులకలకలం

  • సోషల్‌ ‌డియాలో వైరల్‌ ‌కావడంతో అరెస్ట్

పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం శాయంపేట గ్రామానికి చెందిన తిరుమల్‌ ‌రెడ్డి అనే రిటైర్డ్ ఆర్మీ జవానును పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల్‌ ‌రెడ్డి తన వద్ద తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 2002 నుంచి 2019 వరకు ఆర్మీలో పనిచేసి రిటైరైన బద్దం తిరుమల్‌ ‌రెడ్డి డీబిబిఎల్‌ అనే లైసెన్డస్ ‌వెపన్‌, 20 ‌బుల్లె•ట్లను కలిగి వున్నాడు. 2019 డిసెంబర్‌ 31 ‌రాత్రి శాయంపేట లో సరదాగా ఫ్రెండ్స్ ‌తో కలిసి ఓపెన్‌గ్•రిరగ్‌ ‌పాల్పడ్డాడు. గాల్లోకి కాల్పులు జరిపిన దృశ్యాలను గ్రామస్తులు తమ మొబైల్స్ ‌లో చిత్రీకరించారు. తాజాగా ఈనెల 13న గ్రామంలో జరిగిన ఒక వివాహ వేడుకలో గొడవ జరగగా ఆ సమయంలో కూడా తిరుమల్‌ ‌రెడ్డి గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ వీడియోలు, పాత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో స్పందించిన పెద్దపల్లి డిసిపి రవీందర్‌, ఏసిపి హాబీబ్‌ ‌ఖాన్‌, ‌సీఐ ప్రదీప్‌ ‌కుమార్‌, ఎస్సై ప్రేమ్‌ ‌కుమార్‌ అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుమల్‌ ‌రెడ్డి నుంచి డీబీబీఎల్‌ ‌వెపన్‌, 10 ‌రౌండ్ల బు•-లలెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply