Take a fresh look at your lifestyle.

లాక్‌ ‌డౌన్‌ ‌నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు

లాక్‌ ‌డౌన్‌ ‌నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు
వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్‌ ‌మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్‌.‌సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్‌, ‌సీడ్‌ ‌షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్‌ ‌డౌన్‌ ‌వర్తించదు. తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని క్యాబినెట్‌ ‌నిర్ణయించింది. వైద్య రంగంలో ఫార్మాసూటికల్‌ ‌కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్‌ ‌డిస్టిబ్యూట్రర్లు, మెడికల్‌ ‌షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.

గ్రామిణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది. విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి. జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది. జాతీయ రహదారులపై పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి. కోల్డ్ ‌స్టోరేజీ, వేర్‌ ‌హౌసింగ్‌ ‌కార్యకలాపాలకు మినహాయింపు ఇచ్చారు. ప్రింట్‌ అం‌డ్‌ ఎలక్టాన్రిక్‌ ‌వి•డియాకు మినహాయింపు ఇచ్చారు. ఉపాధిహామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి.ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి. గత లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి.

అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి ఇస్తారు. అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. తెలంగాణ చుట్టూ రాష్టాల్ర సరిహద్దుల్లో చెక్‌ ‌పోస్టుల ఏర్పాటుకు నిర్ణయంతీసుకున్నారు. ఇకపోతే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్‌ ‌షాపులు తెరిచే ఉంటాయని తెలిపిన మినహాయింపులను పూర్తిస్థాయిలో కోవిడ్‌ ‌నిబంధనలను అనుసరించి కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని క్యాబినెట్‌ ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్టాల్లో్ర లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి 10 రోజులపాటు లాక్‌డౌన్‌ ‌విధించడంతో చాలామంది స్వగ్రామాలకు ప్రయాణమయ్యారు.

దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. నిన్నటిదాక అరకొర ప్రయాణికులతో కనిపించిన ఎంజీబీఎస్‌, ‌జేబీఎస్‌ ‌బస్టాండ్‌లు ప్రయాణికులతో నిండిపోయాయి. రేపు 10గంటల వరకు మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉండటంతో రాష్ట్రంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు హడావిడిగా ప్రయాణమయ్యారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సుల్లో ప్రయాణించే వారు విధిగా మాస్కులు ధరించాలని. చేతులు శానిటైజ్‌ ‌చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply