Take a fresh look at your lifestyle.

‌ప్రభుత్వాలు అంబేద్కర్‌ ‌మాటలు అనుసరిస్తున్నాయా?

1950,జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం రాజకీయాలలో ఒక వ్యక్తి- ఒక ఓటు,ఒక ఓటు- ఒక విలువ అన్న రాజకీయ సమానత్వాన్ని గుర్తించబోతున్నాం.అయితే సామాజిక, ఆర్ధిక జీవితంలో మనకున్న సామాజిక, ఆర్ధిక వ్యవస్థ వల్ల ఒక వ్యక్తి- ఒక విలువ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాం.వైరుధ్యాలతో కూడిన ఈ జీవితాన్ని ఎంత కాలం భరిస్తూ వద్దాం? ఎంత కాలం మన సామాజిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని సాధించకుండా ఉందాం? ఇలా ఎక్కువ కాలం కొనసాగనిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యమే ముప్పునకు లోనవుతుంది.ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి, లేకపోతే అసమానత్వంతో పీడింపబడుతున్న వాళ్ళు ఈ రాజ్యాంగ సభ కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామిక వ్యవస్థను కుప్పకూలుస్తారు.-డాక్టర్‌.‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌.

‌రాజ్యాంగసభను ఉద్దేశించి డాక్టర్‌. ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ‌గారు మాట్లాడిన పై వాక్యాలు భవిష్యత్తులో సాధించాల్సిన సామాజిక,ఆర్థిక సమానత్వం గురించి స్పష్టంగా పేర్కొంటున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో డాక్టర్‌.‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ‌గారు పేర్కొన్న సామాజిక,ఆర్థిక సమానత్వం కోసం ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి,అభివృద్ధి లక్ష్యాలు నిర్దేశించి,సాధించే ప్రయత్నం చేశారు. భూసంస్కరణల అమలు, జమీందారీ వ్యవస్థ రద్దు, కౌలు విధానాల సంస్కరణ, భూ పరిమితి విధానాలు మొదలైన చర్యలు తీసుకొని సామాజిక,ఆర్థిక సమానత్వం కోసం కృషి చేశారు. ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసి,రాజ భరణాలను రద్దుచేశారు. సామాజిక,విద్యా సమానత్వ సాధనలో భాగంగానే షెడ్యూల్‌ ‌కులాలకు,షెడ్యూల్‌ ‌తెగలకు రిజర్వేషన్లు అమలు చేయబడ్డాయి. సుదీర్ఘ ప్రయాసాల అనంతరం మండల కమీషన్‌ ‌సిఫారసుల ప్రకారం ఇతర వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు అమలు చేయబడ్డాయి.ఏ లక్ష్యాలైతే రాజ్యాంగం నిర్దేశించిందో అట్టి సామాజిక,ఆర్థిక సమానత్వం కోసం ఆయా ప్రభుత్వాలు తమ శక్తి కొలది ప్రయత్నించాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న దేమిటి?.

 

సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించాలని డాక్టర్‌.‌బి.ఆర్‌. అం‌బేద్కర్‌ ‌గారు పేర్కొన్న మాటలను ప్రస్తుత ప్రభుత్వాలు అను సరిస్తున్నాయా?.
సామాజిక, ఆర్థిక మార్పుల కోసం చేపట్టిన చర్యలను కొనసాగిస్తున్నాయా? సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సదుపాయాలను పతిష్టపరుస్తున్నాయా? సామాజిక,ఆర్థిక మార్పులకోసం అనుసరించిన సామ్యవాద పంథాను ముందుకు తీసుకెళ్తున్నాయా? పేద మరియు ధనికులకు ప్రభుత్వ, ప్రైవేటు సదుపాయాలు అందుబాటులో ఉంచే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కొనసాగిస్తున్నాయా? సమాధానం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాజికంగా,విద్యా పరంగా వెనుకబడిన వర్గాల కోసం ఏర్పాటు చేయబడిన రిజర్వేషన్లను పొమ్మనక పొగ పెట్టినట్లు,ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్‌ ‌పరం చేస్తూ పరోక్షంగా రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారు. నాడు ఆర్థిక అసమానతలకు కారణమైన,సంపద కేంద్రీకృతానికి కారణమైన భూమిని భూసంస్కరణల ద్వారా పునర్‌ ‌పంపిణీ చేస్తే,నేడు ప్రకృతి సంపదను కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ,సంపద కేంద్రీకరణకు మార్గం సుగమం చేస్తూ,ఆర్థిక అసమానతలు పెంచి పోషిస్తున్నారు.

ఉన్న ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటు పరం చేస్తూ,పేదవారికి బ్యాంకు సేవలను దూరం చేస్తూ, ఆర్థిక,సామాజిక అసమానతలనుకు ఆజ్యం పోస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పరిధిలో సామాజిక,ఆర్థిక సమానత్వం కోసం ప్రయత్నిస్తుంటే కర్ర పెత్తనం చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను నిర్లక్ష్యం చేయడమో లేదా సవరణల ద్వారా మార్పు చేయడమో జరుగుతుంది.రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చే ప్రయత్నాలు ప్రారంభించారు. తరతరాలుగా బహుజనులను అనగదొక్కిన సంస్కృతియే ఆదర్శవంతమైనదిగా ప్రచారం చేస్తూ సామాజిక,ఆర్థిక అసమానతలు పెంచి పోషి స్తున్నారు.

పేదవారిని నిరుపేదలుగా మార్చుతూ నిరుపేద భారత దేశాన్ని, కోటీశ్వర్లను బిలియనీర్లుగా మార్చుతూ రిచ్‌ ఇం‌డియాని తయా రుచేస్తున్నారు. డాక్టర్‌.‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ‌గారు పేర్కొన్నట్లు సామాజిక,ఆర్థిక అసమానతలు రూపుమాపడం అటుంచితే, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతలు పెంచి పోషించబడు తున్నాయి. ధనికులు ధనికులుగా, పేదవారు మరింత పేదవారుగా మారుతున్నారు. డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ‌గారు చెప్పినట్లు ఈ అసమానతలు తగ్గించకపోతే, రాజ్యాంగ సభ ఎంతో కష్టపడి నిర్మించిన ఈ రాజకీయ ప్రజా స్వామ్య వ్యవస్థను అసమానతలతో పీడి ంపబ డుతున్న వర్గాలు వ్యతిరేకించి, తిరస్క రించవచ్చు. ఆ పరిస్థితి రాకుండా చుసు కోవలసిన బాధ్యత రాజ్యాంగం ప్ర కారం పాలిస్తామని ప్రమాణం చేసిన పాలకు లపైననే ఉన్నదని గుర్తిం చుకోవాలి.

jurru narayana yadav.jp
జుర్రు నారాయణ యాదవ్‌
‌టి టి యు జిల్లా అధ్యక్షులు
మహబూబ్నగర్‌జి
9494019270.

Leave a Reply