Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతిభావంతులు బలి కావడమేనా?

‘‘ఉద్యోగ నియామకాల ప్రస్తావనలో భాగంగా రాష్ట్రంలోని 11 వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్‌ ‌చేస్తామని చెప్పడంతో భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్యలో కోత పడటం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.ప్రధానంగా డిగ్రీ, జూనియర్‌ , ‌యూనివర్సిటీ లు, ఇతర విద్యాసంస్థలలో ఉద్యోగాల కోసం 2012 నుంచి వేచి చూస్తున్న ప్రతిభావంతులకు నష్టం చేకూరుతుంది, క్రమబద్దీకరణ తరువాతజూనియర్‌ ‌డిగ్రీ కళాశాలలో ఖాళీలు పదుల సంఖ్యలో కూడా ఉంటాయో ఉండవో కూడా చెప్పలేము.’’

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రంలోని వివిధ శాఖలలో కాంట్రాక్టు ప్రాతిపదికన నియమింప బడిన ఉద్యోగులను రెగ్యూలరైజ్‌ ‌చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కే సి ఆర్‌ ‌హామీ ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ కు న్యాయపరమైన సమస్యలు తలెత్తడంతో,ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం వారి జీతాలను పెంచడం, పి. ఆర్‌. ‌సి లో కూడా వారిని పరిగణలోనికి తీసుకోవడం తెలిసిన విషయమే. ఇటీవల బడ్జెట్‌ ‌సమావేశాలలో ఉద్యోగ నియామకాల ప్రస్తావనలో భాగంగా రాష్ట్రంలోని 11 వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్‌ ‌చేస్తామని చెప్పడంతో భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్యలో కోత పడటం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.
ప్రధానంగా డిగ్రీ, జూనియర్‌ , ‌యూనివర్సిటీ లు, ఇతర విద్యాసంస్థలలో ఉద్యోగాల కోసం 2012 నుంచి వేచి చూస్తున్న ప్రతిభావంతులకు నష్టం చేకూరుతుంది, క్రమబద్దీకరణ తరువాతజూనియర్‌ ‌డిగ్రీ కళాశాలలో ఖాళీలు పదుల సంఖ్యలో కూడా ఉంటాయో ఉండవో కూడా చెప్పలేము. ఒకవేళ ఖాళీలు లేకపోతే ఆ ఉద్యోగాల కోసం దశాబ్ద కాలంగా వేచిచూస్తున్న నిరుద్యోగులు ఇక శాశ్వతంగా దుర్భర స్థితిలో ఉన్న ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల యాజమాన్యాల క్రిందవెట్టిచాకిరి చేయాల్సిందే. సెట్‌, ‌నెట్‌, ‌పి.హెచ్‌ ‌డి లు చేసిన ప్రతిభావంతులు కూడా ఇక ప్రభుత్వ ఉద్యోగానికి దూరమయ్యే పరిస్థితి. గెజిటెడ్‌ ‌హోదా కల్గిన ఉన్నత స్థాయి ఉద్యోగాలలో ఒప్పంద ప్రాతిపదికపై తాత్కాలికంగా నియమింపబడ్డ ఉద్యోగులను కేవలం రాజకీయ లబ్ది కోసం క్రమబద్దీకరించడం నేరమే అవుతుంది.
కాంట్రాక్టు ఉద్యోగులకంటే ఎక్కువ సామర్థ్యమున్న అభ్యర్థులు బయట ఉన్నప్పుడు ఒక్క మాటతో నిరుద్యోగుల పొట్ట కొట్టడం సమంజసం కాదు. పైగా చాలా శాఖలలో ఒప్పంద నియామకాల సమయంలో అవకతవకలు జరిగిన సంఘటనలు లేకపోలేదు. ఇప్పటికైనా, ప్రభుత్వం ఉన్నత స్థాయి ఉద్యోగాల క్రమబద్దీకరణ లో కొన్ని నిబంధనలు పెట్టాలి. అంతేకాక, ఒప్పంద ప్రాతిపదికన నియమింపబడే రోజు ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఉన్నాయా లేవా పరిశీలించాలి. వారి సర్వీస్‌ ‌కాలానికి వెయిటేజ్‌ ఇచ్చి రెగ్యులర్‌ ‌నోటిఫికేషన్‌ ‌లో అందరితో పాటు వారిని కూడా పోటీలో ఉంచాలి. అలాకాని పక్షములో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్‌ ‌చేస్తే ఖాళీల సంఖ్యలో ( కాంట్రాక్టు ఉద్యోగాల తో కలిపి ) కోత పెట్టకూడదు. తెలంగాణ ఏర్పడ్డాక జూనియర్‌ ‌డిగ్రీ యూనివర్సిటీ స్థాయి ఖాళీలను భర్తిచేయకుండా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులతో కాలం వెళ్లదీయడం ప్రభుత్వం చేసిన తప్పు. ప్రభుత్వాలు చేసిన తప్పుకు నిరుద్యోగులను బలి చేయొద్దు.

Leave a Reply