ఉన్నత విద్యలో తెలంగాణా రాష్ట్ర నిష్పత్తి తగ్గుదల తరుణంలో…
రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఉన్నత విద్య స్థితి గతులను పరిశీలించడమే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశ్యం..
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (MoE విడుదల చేసిన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ AISHE నివేదికల తో తెలంగాణలో ఉన్నత విద్య మొత్తం స్థితిని మనం క్లుప్తంగా పరిశీలించవచ్చు. 2014-15 విద్యాసంవత్సరంలో, అంటే రాష్ట్రము ఏర్పడిన ఏడాది లో 18-23 సంవత్సరాల వయస్సు గల వారి మొత్తం స్థూల నమోదు నిష్పత్తి (GER) పురుషులు 39.2 లకు మరియు మహిళలు 33.0గా ఉంది, రాష్ట్ర మొత్తం 36.1. అయితే ఇది మనం 2019-20 వ విద్య సంత్సరానికి AISHE నివేదికలో పరిశీలిస్తే , అన్ని విభాగాల్లో మొత్తం పురుష GER 34.8 కి తగ్గగా స్త్రీ GER = స్వల్ప పెరుగుదలతో 36.4 నిష్పత్తి లో ఉన్నది .. అయితే రాష్ట్రము మొత్తాన్ని దీనితో చూసినప్పుడు 35.6 కి దిగజారింది. అయితే అసెంబ్లీ సమావేశాలలో విద్యాశాఖ మంత్రి వివరణ ప్రకారం, ఉన్నత విద్యకు రాష్ట్రంలో డిమాండ్ విద్యార్థుల నుంచి పెరిగింది అందుకే విద్యార్థులు పక్క రాష్ట్రాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆసక్తి చూపిస్తున్నారు అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రైవేట్ యూనివర్సిటీలు మన రాష్ట్రంలోనే స్థాపించాలి అని ఆదేశాలు యిచ్చారు.
అని మంత్రి సమావేశంలో చెప్పారు. నిజంగా మంత్రి చెప్పినట్టు డిమాండ్ పెరిగి ఉంటే, 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాతి సంవత్సరాల్లో ఈ నిష్పత్తులు నిశ్చయంగా పెరిగేవి. అవి పెరగకుండా తగ్గు ముఖం పెట్టడం ఏ విధంగా రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనను మద్దతు ఇస్తాయి? అవి ఇలా ఉండగా ఎంత మంది రాష్ట్రంలోనీ విద్యార్థులు నిజానికి పక్క రాష్ట్రాలలో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలలో ఉన్నత విద్య కోసం వెళ్తున్నారు అనే ఏ గుణకాలు చెప్పకపోవడం నిజానికి అధికార పార్టీ అసలు ఉద్దేశాలని ప్రశ్నింపజేస్తాయి .,అదే కాకుండా నిజానికి ఏ కులాల, మరియు వర్గాల నుంచి నిజంగా విద్యార్థులు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలలో జాయిన్ అవుతున్నారు అని చెప్పవల్సిన బాధ్యత అధికార పార్టీ మీద ఉంది.
అంతే కాకుండా 2014-15లో, SC విద్యార్థులలో 18-23 సంవత్సరాల వయస్సు గల వారికి, పురుషులకు GER= 38.1 కాగా, 2019-20లో 29.1కి తగ్గింది . స్త్రీలGER= 34.1 నుండి 35.8కి స్వల్ప పెరుగుదలతో, మొత్తం GER= 2014-15లో 36.1 నుండి 2019-20లో 32.5కి తగ్గింది . మళ్లీ, అదే వయస్సులో ఉన్న ST విద్యార్థులకు, పురుషుల +జు= 39.6, ఇది 2014-15 మరియు 2019-20 మధ్య 31.3కి పడిపోయింది. మళ్ళీ, స్త్రీల GER = 27.5 నుండి 29.1కి స్వల్ప పెరుగుదలతో, మొత్తం GER = ఇప్పటికీ 33.5 నుండి 30.2కి తగ్గింది. అదనంగా, SCసమూహాల నుండి మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య మొత్తం 8788 నుండి 9355 కి పెరిగినప్పటికీ,SC పురుష ఉపాధ్యాయుల సంఖ్య ఇప్పటికీ 5620 (2014-15) నుండి 5502 (2019-20)కి తగ్గింది. ఇది ST వర్గాల నుండి పురుషులు (2524 నుండి 2336) మరియు స్త్రీ(887 నుండి 658) ఉపాధ్యాయుల సంఖ్య తగ్గడంతో మొత్తం ST ఉపాధ్యాయుల సంఖ్య 3,411 నుండి 2,994కి తగ్గింది.
ఇంకా, 2014-15 విద్యా సంవత్సరంలో రాష్ట్రము మొత్తం అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు మరియు ప్రొఫెసర్ల సంఖ్య వరుసగా 68,043బీ 10,261బీ మరియు 7,581. ఇప్పుడు 2019-20 AISHE నివేదిక ప్రకారం, సంఖ్యలు వరుసగా 62,123, 7,444 మరియు 7,190 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు మరియు ప్రొఫెసర్లకు తగ్గాయి. ఐదు విద్యా సంవత్సరాల వ్యవధిలో బోధనా అధ్యాపకుల సంఖ్యను ఇలా తగ్గించడం అంటే విద్యార్థి-ఉపాధ్యాయుల మధ్య సమతుల్యత నిష్పత్తిపై అధిక ఒత్తిడి, విద్య నాణ్యతను తగ్గించడంబీ విద్య మరియు పరిశోధనల నాణ్యతను పెంచడం పట్ల రాష్ట్రానికి ఉన్న నిబద్ధతను ఈ గణాంకాలు మనకు సూచిస్తుంది. ఇంతే కాకుండా రాష్ట్ర విద్య బడ్జెట్ ను కూడా ఒక్కసారి గమనిస్తే ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం విద్యకు కేటాయించే బడ్జెట్ తగ్గించుకుంటు వస్తుంది దీనికి ప్రభుత్వ గణాంకాలు ఉదాహరణ విద్యా సంవత్సరం 2014-15. 2014-15 ఆర్థిక సంవత్సరంలో విద్యకు రాష్ట్ర మొత్తం బడ్జెట్‌లో 10.89% కేటాయించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, తెలంగాణ ప్రభుత్వం మొత్తం బడ్జెట్ రూ.2,56,958 కోట్లలలో కేవలం 6.24% లేదా రూ.16,042 కోట్లు మాత్రమే కేటాయించింది.దీనిని బట్టి మనం రాష్ట్రంలో ప్రభుత్వం ఏ మేరకు విద్యను పటిష్టం చేయాలి అని పని చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు.
ఇంకా ప్రధానంగా మనం చూసుకుంటే గత కొన్ని నెలలుగా ప్రభుత్వ నిర్వహణలోని సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని మరియు ఇతర ఎస్సి . ఎస్టీ. బీసీ మరియు ఇతర సంక్షేమ హాస్టలలో ఫుడ్ పాయిజన్ కారణంగా అణగారిన వర్గాల పేద విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే మనం గుర్తించావాల్సిన ఇంకో విషయం ఏమిటి అంటే ఈ భోజన నాణ్యత సమస్య ఉస్మానియా లాంటి రాష్ట్ర ప్రధాన యూనివర్సిటీ లో కూడా ఇదే దీనమైన పరిస్థితి ఉన్నదీ. ఈ సమస్యలు తీర్చాలి అని విద్యార్థులు అక్కడ అక్కడ నిరసనలు కూడా వ్యక్తం చేసారు.. అయినప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.
అయితే ముఖ్యమంత్రి జరిగిన అసెంబ్లీ సమావేశాలలో విద్యార్థుల వసతి గృహాలలో భోజన నాణ్యత సమస్యను గుర్తించినప్పటికీ ఈ సమస్య పరిష్కరానికి ఏ తక్షణ నివారణ చర్యలు తీసుకోలేదు. విద్య మెరుగుగా ఉంటేనే రేపటి బంగారు తెలంగాణా ఏమో కానీ కనీసం భవిషత్తు ఉన్న తెలంగాణ ను నిర్మించగలము. ఈ చర్చ అంత ఏ విధంగా ఉన్నపటికీ మనం ప్రధానంగా ఈ పైన ఉన్న ఉన్నత విద్య గణాంకాలు చూసినప్పుడు ఉన్నత విద్య సమస్యను పరిష్కారం చూపించకుండా కేవలం కొందరు అధికార పార్టీ మరియు డబ్బు ఉన్న బడా బాబుల గల్లా పెట్టెలు నింపడానికి ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకురావడం ఈ ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రశ్నించదగ్గ విషయమే. రాష్ట్రంలో కనీసం 80 శాతం ఉన్న అణగారిన వర్గల ఉన్నత విద్య ఆశయాలను సమాధి చేయడమే అవుతుంది. ఇప్పటికయినా బర్రె, గొర్రె, తో పాటు విద్య రంగాన్ని యుద్ధ ప్రాతిపాదికన పటిష్టం చేయాలి. రాష్ట్రానికి వొస్తున్న అవార్డుల గొప్పలు ట్విట్టర్ భజనలు తో పాటు దారి తప్పిన రాష్ట్ర ఉన్నత విద్య పరిస్థితి కొంచం చూసుకొని దానిని దారిలో పెడితే బాగుంటుంది.
– అశోక్ ధనావత్ .
ఎం. ఏ. డెవలప్మెంట్ స్టడీస్
సీనియర్ రిసెర్చ్ నేషనల్ కాంపెయిన్ ఆన్ దళిత్ హ్యూమన్ రైట్స్
ఎరాస్మస్ యూనివర్సిటీ, నెథర్లాండ్స్ .
dhanavathashok9849@gmail.com