Take a fresh look at your lifestyle.

నీ ముందరే ఉన్నాయి

రాసులుగా పోసిన
పదాలు.. కానీ నీకు
చెప్పలేకున్నా,..

హృదయాన్ని
హత్తుకునేలా
కొన్ని కల్పనలు
జత చేసి, కసితో
కవ్వింపు పదాలు
జోడించి నీ ముందరే
పోశాను ఈ అక్షర
రాశులని…

నీ తియ్యని
పలకరింపు చూసి
చెప్పాలని ఉన్న
చెప్పలేకున్నానేమో…

చెట్టుని పెనవేసిన
తీగలా, నా మనసు
చుట్టూ ఈ మౌనం
అలుముకుంది…

ఎంత వద్దన్నా
నీ చిక్కని చిగుర్ల
కబుర్లు నా మనసుని
సరికొత్తగా చిగురించేలా
చేస్తుంది… నీ వలపు
నా మదికి చేరినట్టు,
ఆ వలపుల కౌగిలిలో
నేను బందినై
నీ వైపు అలానే
చూస్తూ, నీ ఒడిలో
సేద తీరుతూ నీకు
ఎన్నో ముచ్చట్లని
చెప్పాలని ఉన్న
చెప్పలేక నీ ముందు
ఈ అక్షర రాశులనీ
ఉంచానోయ్‌…

– ‌ప్రియగోలి,గుంటూరు,
8500881385

Leave a Reply