Take a fresh look at your lifestyle.

భారత రాజ్యాంగ శిల్పి, దళిత జాతుల వైతాళికుడు…

నేడు భారత రాజ్యాంగ నిర్మాత దేశంలో అస్పృశ్య నిర్మూలన కోసం మహోద్యమాన్నే చేపట్టి దేశ వ్యాప్తంగా వున్న దళితుల్లో సాంఘీక, విద్య, రాజకీయ చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి, దళిత జాతుల వైతాళికుడు, డాక్టర్‌ ‌బాబా సాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌వర్ధంతి. 1956, డిసెంబర్‌ 6 ‌నుండి దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజలు తమ ప్రియ తమ నేత అంబేద్కర్‌ను గుర్తుచేసుకుంటూ ఘనంగా నివా ళులర్పిస్తున్నారు. ముస్లింల ప్రార్థనామందిరం బాబ్రీ మసీ దును సరిగ్గా ఈ రోజునే (1992 డిసెంబర్‌ 6) ‌కూల్చివేశారు. ఇది జరిగి నేటికి 22 ఏళ్లు. అంబేద్కర్‌ ‌వర్ధంతి నాడే ఈ ఘటన జరగ డంతో ఈ దినం రెండు రకాలుగా మన జ్ఞాపకాలను తడుము తోంది.

మహారాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలో, మందన్‌గాడ్‌ ‌పట్టణానికి దగ్గరున్న అంబావాడే గ్రామంలో మెహర్‌ ‌కులానికి చెందిన, రాంజీ సక్‌పాల్‌, ‌భీమాబాయి దంపతుల 14వ సంతానంగా 1891 ఏప్రిల్‌ 14‌న జన్మించాడు. అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణం (మందనగడ్‌ ‌తాలూకాలో) వారు కావున మరాఠీ నేపథ్యం కలవారు. అంబేద్కర్‌ ‌పట్టుదలతో తన 15 వ ఏటనే మెట్రిక్యులేషన్‌ ‌ప్రధమ శ్రేణి లో ఉతీర్నుడైనాడు. అగ్రకుల విద్యార్ధులను మించి ఉతీర్ణుడైన భీమ్‌రావు చురుకుతనం, సహనం, పట్టుదల మేధావితనం చూసి, కేతాస్కర్‌ అనే ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుడు భీమ్‌రావుని ప్రేమతో, వాత్సల్యంతో చూసేవాడు. భీమ్‌రావులో ఆత్మస్థయిర్యాన్ని నింపి, ఉన్నతస్థాయికి ఎదిగేలా సహాయం చేశాడాయన. బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్‌ అం‌బేద్కర్‌. ‌కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా వుండి 1951 అక్టోబర్‌ ‌లో మంత్రి పదవికి రాజీనామా చేశాడు.

దేశానికి దశ, నిర్దేశం. కడవరకు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. స్వాతంత్య్రభారతావనికి తొలి న్యాయశాఖ మంత్రి. ఇంకా ఇండిపెండెంటు ఇండియాకు రాజ్యాంగరచన బాధ్యతలను నాటి తొలికాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. భారతరాజ్యాంగ పరిషత్‌ ‌నియమించిన రాజ్యాంగ సంఘానికి ఆయనను అధ్యక్షునిగా నియమించి సముచిత గౌరవానిచ్చారు. అదే ఆయన జీవితంలో మహోజ్వల మలుపుచరిత్రలో ఓ శాశ్వతమైన సాథనాన్ని కల్పించిన మహత్తరమైన ప్రస్థానం.

బడుగువర్గాలకు వెలుగును పంచిన సందర్భం. అనేక రాజ్యాల రాజ్యాంగాన్ని ఆధ్వయనం చేసి ఒక స్థిరమైన, దృఢమైన రాజ్యాంగాన్ని, భరతమాతకు బహుమా నంగా అందించారు. ఈ మేధావి. తరతరాలుగా బడుగు, బలహీనవర్గాల కష్టాల్ని గట్టెక్కిస్తూ వారి అభ్యున్నతకి రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాల్లో వేయికాంతుల వెలుగుల్ని నింపారు. 1932లో బ్రిటీష్‌ ‌ప్రభుత్వం కమ్యూనల్‌ అవార్డును ప్రకటించింది. దాని ప్రకారం అస్పృశ్యులకు ప్రత్యేక స్థానాలు లభించాయి. ఎరవాడ జైలులో వున్న గాంధీజీ నిరాహారదీక్ష ప్రారంభించాడు. ‘‘మహాత్ములు వస్తుంటారు. పోతుంటారు. అంటరాని వారు మాత్రం అంటరాని వారుగానే వుంటున్నారు.’’ అన్నాడు అంబేద్కర్‌.

అం‌బేద్కర్‌ ‌ప్రసిద్ధ గ్రంథాలు వ్రాశాడు. ‘ది ప్రాబ్లం ఆఫ్‌ ‌ది రూపీ’, ‘ప్రొవిన్షియల్‌ ‌డీ సెంట్రలైజేషన్‌ ఆఫ్‌ ఇం‌పీరియల్‌ ‌ఫైనాన్స్ ఇన్‌ ‌బ్రిటీష్‌ ఇం‌డియా’,
‘ది బుద్దా అండ్‌ ‌కార్ల్ ‌మార్కస్’,
‘‌ది బుద్ధా అండ్‌ ‌హిజ్‌ ‌ధర్మ’ ప్రధానమైనవి.
బౌద్ధ మతం స్వీకరించుట :.1956 అక్టోబరు 14న నాగ్‌ ‌పూర్‌ ‌లో అంబేద్కర్‌ ‌బౌద్ధమతాన్ని స్వీకరించాడు. గాంధీజీతో అనేక విషయాలలో భేదించినా తాను మతం మారదలచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరం అయినదానినే ఎన్నుకుంటానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకుండా చూచానన్నాడు. హిందువుగా పుట్టిన అంబేద్కర్‌ ‌హిందువుగా మరణించలేదు.

చికిత్స కోసం బొంబాయికి వెళ్ళాడు, అక్కడ ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్‌ ‌ను 15 ఏప్రిల్‌ 1948 ‌న వివాహం చేసుకున్నాడు,.అంబేద్కర్‌ ‌మొదటి భార్య రమాబాయి 1935 లో సుదీర్ఘ అనారోగ్యంతో మరణించారు. మహామేధావిగా, సంఘసంస్కర్తగా, కీర్తిగాంచిన డాక్టర్‌ ‌భీమారావ్‌ అం‌బేద్కర్‌ ‌గొప్ప రాజనీతీజ్ఞులు, న్యాయ కోవిదులు, ఆర్థికవేత్త, ఎన్నో సంస్కరణలకు ఆద్యుడైన డా. అంబేద్కర్‌ 1956 ‌వ సంవత్సరంలో ఇదే తేదీన మరణించారు. అంబేద్కర్‌ 1990‌లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ అవార్డును మరణాంతరం పొందారు.

jajula dinesh
జాజుల దినేష్‌
‌M.A (B.Ed,) SET
ఉస్మానియా యూనివర్సిటీ
9666238266

Leave a Reply