Take a fresh look at your lifestyle.

పోతిరెడ్డిపాడుపై ఏపి నిర్ణయం సరికాదు

ఖమ్మం, మే 13ప్రజాతంత్ర (ప్రతినిధి) : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ పోతిరెడ్డిపాడు కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరక రంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌ ఆరోపించారు. బుధవారం ఖమ్మం వీడిఓస్‌ ‌కాలనీ క్యాంప్‌ ‌కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనా లకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ఆయా ప్రక్రియ చేపట్టారని, న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్ ‌కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రం చేసిన తప్పిదాలుగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంభిస్తామని స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రా •క్టు నుంచి మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం, దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేయడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం చేపట్ట తలచిన ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరం కాబట్టి, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వంతో కలిసి న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు.

‘‘తెలంగాణలో కానీ, ఆంధ్రప్ర దేశ్‌ ‌లో కానీ కొత్త నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అపెక్స్ ‌కమిటీ అనుమతి తీసుకోవాలని ఆంధ్రప్ర దేశ్‌ ‌పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొన్నదని, కానీ ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం అపెక్స్ ‌కమిటీ ఆమోదం తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కనీసం సంప్రదించ కుండా ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రం శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని లిఫ్టు చేయాలని నిర్ణయించి, జీవో జారీ చేసింది. ఇది తీవ్ర అభ్యంతకరం. కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రం తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుంది. అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుం డా ఆదేశాలు జారీ చేయాలని కె.ఆర్‌.ఎం.‌బి.లో ఫిర్యాదు చేశాం అని స్పష్టం చేశారు. గతంలో ఉన్న వివాదాలను, విబేధాలను పక్కన పెట్టి రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాల ను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఎపికి స్నేహహస్తం అందించిందన్నారు. బేసిన్లు, బేషజా లు లేకుండా నీటిని వాడుకుందామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే చెప్పారని అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించ కుండా శ్రీశైలంలో నీటిని లిఫ్టు చేయడానికి ఏకపక్షంగా కొత్త పథకం ప్రకటించడం అత్యంత బాధాకరమన్నారు. పరస్పర సహకారంతో నీటిని వాడుకుందామనే స్పూర్తికి ఇది విఘాతం కలిగించిందని. తెలంగాణ రాష్ట్ర ప్రయో జనాలకు భంగం కలిగితే రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఎపి తలపెట్టిన కొత్త ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తాం. గోదావరి నది నికర జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న 950 టిఎంసిల నీటిని వాడుకోవడానికి అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదన్నారు. తెలంగాణకు ఇంకా నీటి అవసరం ఉంది. మంచినీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు, విద్యుత్‌ ‌ప్లాంట్లకు నీరు కావాల్సి ఉందన్నారు. పోతిరెడ్డి పాడు పై మా పార్టీకి ,ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందని.

ఓ పోతిరెడ్డి పాడే కాదని గోదావరి ,కృష్ణా నదుల్లో తెలంగాణకు వాటా గురించి గతంలో పోరాడినం. రాయలసీమకు అక్రమంగా ఒక్క నీటి బొట్టును తరలించినా ఊరుకునేది లేదని గతంలో చెప్పామని, ఇపుడు కూడా చెబుతున్నాం ఈ నెల 5 న ఏపీ ప్రభుత్వం పోతి రెడ్డి పాడు నుంచి 80 వేల క్యూసెక్కులను అక్రమంగా తరలించేందుకు జీవో విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ న్నారు. ఇప్పటికే ఈ అంశంపై సీఎం కెసిఆర్‌ ,‌దక్షిణ తెలంగాణ కు సంబంధించిన మంత్రులు, పార్టీ నేతలు, ఇరిగేషన్‌ ‌నిపుణులతో సీఎం కెసిఆర్‌ ‌చర్చించారని బ్రిజేష్‌ ‌కుమార్‌ ‌ట్రిబ్యునల్‌ ‌తో పాటు సుప్రీం కోర్టు లో ఏపీ ప్రభుత్వ అక్రమ నీటి తరలింపులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నేతృత్వంలో పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల పై అవగాహన ,సమాచారం లేని వారు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోతిరెడ్డి పాడు పై ఏపీ బీజేపీ నేతలు ఓ రకంగా, తెలంగాణ బీజేపీ నేతలు మరో రకంగా మాట్లాడటం జాతీయ పార్టిగా చెప్పుకునే బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్ట్ ‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రూ. 12 కోట్ల అదనపు శాంక్షన్‌ ఇచ్చారని గుర్తు చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ బాలసా ని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ ‌లింగాల కమల్‌ ‌రాజ్‌ , ఎమ్మెల్యే రాములు నాయక్‌ , ‌డీసీసీబీ చైర్మన్‌ ‌కురాకుల నాగభూషణం, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్‌ ‌కొండబాల కోటేశ్వరరావు , రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు ,డీసీఎంఎస్‌ ‌చైర్మన్‌ ‌శేషగిరి రావు ,ఏఎంసి చైర్మన్‌ ‌వెంకట రమణ లు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!