Take a fresh look at your lifestyle.

ఎపి శాసనమండలి రద్దుకు ఆమోదం

  • సుదీర్ఘ చర్చ అనంతరం ఏకగ్రీవ తీర్మానం
  • రాజకీయాలకు వేదికగా మండలి..అందుకే రద్దు : సిఎం వైఎస్‌ ‌జగన్‌

Approval of repeal of AP Legislative Council

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ‌శాసన మండలి రద్దును ఆమోదిస్తూ చేసిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. ఈ మేరకు సుదీర్ఘ చర్చ అనంతరం సిఎం వైఎస్‌ ‌జగన్‌ ‌రద్దుకు గల కారణాలను వివరించారు. అనంతరం శాసనసభలో సాయంత్రం వోటింగ్‌ ‌నిర్వహించారు. సభలో ప్రవేశపెట్టిన మండలి రద్దు తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రద్దు తీర్మానంపై ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి ప్రసంగం అనంతరం మండలి రద్దు తీర్మానంపై వోటింగ్‌ ‌జరిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సీఎం నేతృత్వంలోని కేబినెట్‌ ‌శాసనసభకు జవాబుదారీగా ఉంటుందని జగన్‌ అన్నారు. సభకు హాజరైన 133 మంది సభ్యులు అనుకూలంగా వోటు వేశారు. అనంతరం తీర్మానం ఆమోదం పొంది నట్లు అసెంబ్లీ స్పీకర్‌ ‌తమ్మినేని సీతారాం ప్రకటించారు. రాజ్యాంగంలోని 169 అధికరణ ప్రకారం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్‌ ‌తెలిపారు.

Approval of repeal of AP Legislative Council

1983 ‌మార్చి 28న ఉమ్మడి రాష్ట్రంలో మండలి రద్దును సమర్థ్ధిస్తూ ప్రముఖ దినపత్రిక ఈనాడులో ప్రచురితమైన సంపాదకీయం. మండలిని రద్దు చేయాలని సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా పెద్దల సభను రద్దు చేయాలని తీర్మానించి.. దానిని సీఎం జగన్‌ ‌శాసనసభ ముందు ఉంచారు. దీనిపై రోజంతా సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు చేస్తున్నట్లు సభ్యులంతా తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు.

Tags: Approval,repeal, AP Legislative Council, Jagan govt

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply