Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌ ‌గ్రేటర్‌ ఎన్నికల కమిటీ నియామకం

  • ప్రకటించిన టీపీసీసీ నేడు అభ్యర్థుల ఖరారు..
  • 19న అభ్యర్థులకు బీ ఫామ్‌లు..
  • 21న మేనిఫెస్టో

గ్రేటర్‌ ఎన్నికల సైరన్‌ ‌మోగడంతో అన్ని పార్టీలు యుద్ధానికి సిద్ధమౌతున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ గ్రేటర్‌ ఎన్నికల కమిటీని నియమించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మంగళవారం కమిటీ పేర్లను విడుదల చేస్తూ ఒక ప్రకటన చేశారు. పార్లమెంట్‌ ‌నియోజక వర్గాల వారీగా గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ఎన్నికల కమిటీలను టీపీసీసీ ప్రకటించింది. బల్దియా పరిధిలోకి వొచ్చే 5 పార్లమెంట్‌
‌స్థానాలైన హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌, ‌మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజక వర్గాలవారిగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంచార్జ్‌ల నియామకం చేపట్టింది.

హైదరాబాద్‌ ‌పార్లమెంట్‌కు మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, సికింద్రాబాద్‌ ‌పార్లిమెంట్‌కు సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, చేవెళ్ల పార్లిమెంట్‌కు టీపీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌పొన్నం ప్రభాకర్‌, ‌మల్కాజ్‌గిరి పార్లమెంట్‌కు ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి, మెదక్‌ ‌పార్లమెంట్‌కు టీపీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కుసుమ కుమార్‌ను నియమించగా  3 పార్లమెంట్‌లకు 5 గురు చొప్పున, 2 పార్లమెంట్‌లకు 6 చోప్పున సభ్యులను ప్రకటించింది. సికింద్రాబాద్‌, ‌చేవెళ్ల పార్లమెంట్‌ ‌పరిధిలో 6 గురు సభ్యులను నియమించారు. ఎలక్షన్‌ ‌మేనేజ్‌మెంట్‌ అం‌డ్‌ ‌పబ్లిసిటీ కమిటీని పార్టీ నేతలు ప్రకటించారు. నేడు అభ్యర్థులను కూడా పూర్తి స్థాయిలో ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 19వ తేదీన అభ్యర్థులకు బీ ఫామ్‌లు సైతం అందచేయనున్నట్లు తెలుస్తోంది.నవంబర్‌ 21‌న జీహెచ్‌ఎం‌సీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు పార్టీ ప్రకటించింది.

Leave a Reply