సిద్దిపేట జిల్లాలోని వైద్య విధాన పరిషత్ పరిధిలో గల ఏరియా హాస్పిటల్ గజ్వేల్ లో కాంట్రాక్ట్ బేసిక్‌లో రేడియాలజీ పోస్టు ఖాళీగా ఉందనీ, ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని డాక్టర్ మహేష్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. నెలకు ఒక లక్ష రూపాయల వేతనం ఇవ్వనున్నట్లు చెప్పారు.
రేడియాలజీ పూర్తి చేసి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ • రిజిస్టర్ అయిన వారు ఈ పోస్టుకు అర్హులన్నారు. జిల్లా మెడికల్ కమిటీ ద్వారా రేడియాలజిస్టును ఎంపిక చేస్తారనీ, ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్ధులు ఈ నెల 5 సాయంత్రం 4గంటలలోగా గజ్వేల్ ఏరియా ఆసుపత్రిలో దరఖాస్తును సమర్పించాల్సిందిగా డాక్టర్ మహేష్ కోరారు.