Take a fresh look at your lifestyle.

డిజిటల్‌ ‌లెర్నింగ్‌ ‌కోసం యాప్‌

  • విద్యార్థుల సందేహాల నివృత్తికి వీడియో కాల్‌ ‌సదుపాయం
  • నాడునేడు కింద అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు
  • జులై నాటికి వసతుల కల్పన పూర్తి చేస్తాం
  • నాడు-నేడు కార్యక్రమంపై సిఎం జగన్‌ ‌సమీక్ష
  • వివరాలు వెల్లడించిన మంత్రి ఆదిమూలపు సురేశ్‌

అమరావతి,జూన్‌ 3: ‌పిల్లలు నేర్చుకునే విధానం, వారు చూపిస్తున్న ప్రతిభపై.. నిరంతరం అధ్యయనం జరగాలని ఏపీ సీఎం జగన్‌ ‌పేర్కొన్నారు. డిజిటల్‌ ‌లెర్నింగ్‌ ‌కోసం సమగ్రంగా యాప్‌ ‌రూపకల్పన చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి వీడియో కాల్‌ ‌సదుపాయం కల్పిస్తామన్నారు. ఆగస్టు 3న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నందున.. జూలై చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలని జగన్‌ ఆదేశించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. స్కూల్లో సదుపాయాలపై టోల్‌‌ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ‌పేర్కొన్నారు.విద్యారంగంలో నాడు-నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సక్ష నిర్వహించారు. నాడు-నేడులో భాగంగా స్కూళ్లలో ఏర్పాటు చేయనున్న సదుపాయాలను ఆయన పరిశీలించి, అందుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ‌డియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలోనే నాడు-నేడు కార్యక్రమం నిలిచిపోతుందని అన్నారు.

జులై చివరి నాటికి అన్ని పాఠశాల్లో నాడు-నేడు పూర్తి చేస్తామని, ఇప్పటికే చాలాచోట్ల పనులు ఊపందుకున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ‌వివరించారు. మొదటి దశలో నాడు-నేడు కింద 15,700 మౌలిక సదుపాయాల కల్పిస్తున్నామని వివరించారు. నాడు-నేడు ద సీఎం వైఎస్‌ ‌జగన్‌ ఎప్పటికప్పుడు సక్ష నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిర టెండర్లు ఇప్పటికే పూర్తి చేశామని మంత్రి తెలిపారు. ఇది దేశ చరిత్రలోనే నిలిచిపోతుందని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని మంత్రి సురేష్‌ ‌పేర్కొన్నారు. మొదట దశలో 500 కొత్తగా జునియర్‌ ‌కళాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ’జగన్న గోరు ముద్ద’ కోసం టోల్‌ ‌ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. టీచర్ల బదిలీలకు సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చారని మంత్రి తెలిపారు. సీఎం వైఎస్‌ ‌జగన్‌ ఆదేశాల మేరకు బదిలీలు చేపడతామని వివరించారు. ఇదిలావుంటే ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినేట్‌ ‌సమావేశంలో చర్చించే అంశాలపై నివేదికలు పంపాలని అన్ని శాఖల అధికారులను సీఎస్‌ ఆదేశించారు.

Leave a Reply