Take a fresh look at your lifestyle.

స్వేద క్రోధ గీతం’స్వేద క్రోధ గీతం’

*అస్నాల శ్రీనివాస్*
మేము చరిత్రలో ఏ ఉపద్రవాలకు ఉత్ప్రేరకం కాము
సంపద సృష్టికి ఉతమయ్యిన వాళ్ళం కానీ
ఎవరిని మాకు ఉతమవ్వమని అడిగిన వాళ్ళం కాదు
భూమిని చిత్రహింస పెట్టినవాళ్ళం కాదు
నేల మీద అచ్చంగా భూతల్లి ఎద పై తారాడుతూ పారాడుతూ తల్లి పాల తొలకరి చుక్కల సౌరభాలం
నింగిలోని అందాలను నయన స్పర్శతో
చెట్టు చెమల సమీరాలను మునివేళ్ళ పెదాలతో
ప్రేమ గా ముద్దాడిన వాళ్ళం..
గాలిలో ప్రయాణించినవాళ్ళం కాదు
ఆ తాహతు ఉన్న శిష్ట వర్గం కాదు
కరుకు కండరాల కొలిమి ఇమ్యున్ లము కానీ
కర్కశ కరోనా కు వాహకులం కాదు
అయిన ప్రతి విపత్తుకు మేము బలిపశువులం
ఎత్తైన కొండలాంటి భవన గోడలం
కర్మాగారాల పొగ గొట్టాలం
నియాన్ దీపాల ఇంధనాలం
విశ్రాంతి లేని పగటిపూటలతో
నిద్రలేని రాత్రులతో శ్రమించే
సూర్య చంద్రులం.
మాకే మనసే ఉందని తెలియని ప్రభువులకు
నాలుగు గోడల భద్రతలోని బుద్ధి జీవులకు
మా స్వెదాలతో సౌధాలు నిర్మించుకున్న నిర్ధయులకు
మీ కరుణా కటాక్షాల సారింపును యాచించడమేలేదు
 *ఖాళీ రహదారుల నగ్నత్వాన్ని* *కప్పివేస్తూ*
 *రైలుపట్టాల తుప్పును వదిలిస్తూ*
మా మూలాల వైపు లాంగ్ మార్చ్ ను సాగిస్తున్నాం
విభజన కాలంలో విద్వేషాగ్నులు ప్రజ్వరిల్లినప్పుడు
సమస్త విపత్తుల విలయతాండవం లో తొలి సమిధలుగా ఈ నడకను అలవాటు చేసుకున్న వాళ్ళం
పగటి తలపై సూర్యనితో వీపు పై బరువుతో
భుజాలపై భావి భారత పౌరులతో
పాదాల పగుళ్ల రసితో రక్తపు ముద్రలతో
భూతల్లికి లేపణమవుతున్నాము..
 *లెక్కించలేని వర్షపు చినుకులై*
 *ఇసుక రేణువులై* *జాగృతమవుతాము*
 *ఆకలితో పొలాలు వాటికవే విత్తిన* *విత్తనాలను తింటున్న* *సమయంకై….*
                  *అస్నాల శ్రీనివాస్*

(లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన వలస కార్మికులు తమ ఊర్లకు చేరడం కోసం వందల కిలోమీటర్లు దూరాన్ని నడకతో ప్రయాణిస్తున్న నేపద్యానికి చలించి..)

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply