Take a fresh look at your lifestyle.

ఎపిలో ఆగని కొరోనా పంజా

  • కొత్తగా మరో 67 కేసుల నమోదు
  • మొత్తం కొరోనా కేసుల సంఖ్య 1650కి చేరిక

విజయవాడ,మే 4: ఏపీపై కరోనా వైరస్‌ ‌పంజా విసురుతోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో ప్రతిరోజూ 50కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 67 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1650కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ ‌బులిటెన్‌ ‌విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 10,292 శాంపిల్స్‌ను పరీక్షించగా 67 మందికి కరోనా నిర్దారణ అయినట్టు తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి 524 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, 33 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1093 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

గడిచిన 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 19, చిత్తూరు జిల్లాలో 1, వైఎస్సార్‌ ‌జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 12, కర్నూలు జిల్లాలో 25, విశాఖపట్నం జిల్లాలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 491కు చేరింది. గుంటూరులో 19 కేసులు నమోదు కాగా కృష్ణా జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా పెద్దగా కేసులు నమోదు కాని విశాఖ జిల్లాలో ఒక్కరోజే 6 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలలో కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు ప్రతిరోజూ అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తూ ఉండటంతో మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో కరోనా పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply